నవ్యాంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల సందడి మొదలైంది. గత మార్చిలో జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆగస్టులో నంద్యాల శాసనసభా స్థానం నుంచి పోటీకి తన సోదరుడైన శిల్పా మోహనరెడ్డికి అవకాశం కల్పించలేదన్న కారణంతో ఆయన పార్టీ మారారు. అయితే ముందుగా టీడీపీ తరఫున దక్కించుకున్న మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని వైకాపా అధినేత జగన్ ఆదేశించడంతో చక్రపాణిరెడ్డి పదవికి రాజీనామా చేశారు.
శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేయడంతో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు తుదిగడువు డిసెంబరు 26. జనవరి 12న పోలింగ్. జనవరి 16న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి ఎన్నిక తేదీ ఖరారు కావడంతో పార్టీల్లో సందడి మొదలైంది. ఇప్పటికే ఇటు అధికార - అటు ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై చర్చ మొదలవడం గమనార్హం.
ఖాళీ అయిన శాసనమండలి సభ్యత్వం కోసం వైసీపీ తరఫున చక్రపాణిరెడ్డి పోటీని పోటీ చేయించేందుకు జగన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శిల్పా చక్రపాణిరెడ్డి పేరు దాదాపు ఖరారు కావడంతో పార్టీలో ఇతరులెవరూ టికెట్ కోసం ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. కాగా అధికార తెలుగుదేశం తరపున పోటీ చేస్తే... సులభంగా విజయం సాధించే అవకాశముండటంతో టికెట్ కోసం ముగ్గురు - నలుగురు పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా మాజీమంత్రి - ఎపీఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్ - నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి - మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నాయకుల ద్వారా వెల్లడవుతోంది.
కాగా, నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఎస్పీవైరెడ్డితో జరిపిన చర్చల్లో శాసనమండలి స్థానిక సంస్థల అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు నంద్యాలలో ప్రచారం జరిగింది. చంద్రబాబు ఇచ్చిన హామీ కారణంగా ఆయనకే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కుతుందన్న భావన కొందరు నేతలు వ్యక్తం చేస్తుండగా బీసీ సామాజికవర్గం వారిని సంతృప్తి పర్చడానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన సోదరుడైన కేఈ ప్రభాకర్ కు టికెట్ ఇప్పించడానికి విశేష కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. దీంతో వీరివురిలో ఒకరికి టికెట్ ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నా మాండ్ర శివానందరెడ్డి - ఏరాసు ప్రతాపరెడ్డి సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలంటున్నారు. మొత్తంగా కర్నూలులో మరోమారు ఎన్నికల హీట్ ప్రారంభమయిందని చెప్తున్నారు.