మోడీ హవా ఇంత ఉంటుంది.. అంత ఉంటుంది అని అనవసరంంగా భయపడిపోయాం.. ఆ భయంలో అనవసరంగా కాంగ్రెస్ పార్టీని దగ్గర చేర్చి.. వారికి బీహార్ లో బలం పెరిగే అవకాశం ఇచ్చాం.. నిజానికి ఆ పార్టీని దూరం పెట్టి ఉన్నా సరే.. మనకు విజయం దక్కేదే.. అని మహాకూటమిలోని లాలూ-నితీశ్ వర్గాలు ఇప్పుడు వ్యాఖ్యానించుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో నడుస్తున్న పోస్ట్ రిజల్ట్స్ చర్చోపచర్చల్లో ఈ వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 27 స్థానాలు లభించాయి. గత పర్యాయం లభించిన సీట్లతో పోలిస్తే.. 25 సీట్లు పెరిగాయి. బీహారుకు సంబంధించినంత వరకు ఆ పార్టీకి ఇది చాలా పెద్ద విజయం అనుకోవాలి. అయితే ఈ విజయం కేవలం లాలూ-నితీశ్ కూటమి పుణ్యమే అని కూడా నమ్మాల్సిందే! ఈ కూటమిలో లేకపోతే గనుక.. కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా ఉండేదేమో.
అదే వాదన ఇప్పుడు మహా కూటమి పెద్దల్లోనూ నడుస్తోంది. అనవసరంగా విజయంలో మన రెండు పార్టీలకు దక్కిన వాటాను తగ్గించుకున్నాం. ఈ కాంగ్రెస్ తో మనకు ఒరిగిందేమీ లేదు.. మనవల్ల వాళ్లకు లాభంజరిగిందే తప్ప.. అని ఈ రెండు పార్టీల నేతలు అనుకుంటున్నారట.
కానీ మోడీ ప్రభావం వల్ల బీహార్ లో ఏదో అయిపోతుంది.. అని భాజపా వ్యతిరేకులంతా ఆందోళన చెందిన మాట మాత్రం వాస్తవం. కేవలం మోడీ హవా బీహార్ ను ఊడ్చేస్తుందేమో అనే భయంతోనే .. మహాకూటమిలోని పార్టీల మధ్య సిద్ధాంత పరమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. వారు ఈ ఎన్నికల వరకు ఒక్కతాటిపై ఉండిపోరాడారు. కాకపోతే తామెవ్వరూ కూడా ఊహించని స్థాయిలో.. ఇంత పెద్ద సంఖ్యలో స్థానాలు రావడం వారికే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల ఫలితాలకు ముందు లాలూ కూడా.. 150 కంటె ఎక్కువ స్థానాలు సాధిస్తాం.. అంటూ తనదైన జోస్యం చెప్పారు.
సహజంగానే అది అతిశయం అయి ఉంటుదని.. వారి కూటమి గెలిచినా 130 వద్ద ఉంటుందని అంతా అనుకున్నారు. అలాంటిది ఏకంగా.. వారు 170 కి పైగా వెళ్లిపోయారు. ఇంత భారీ విజయాన్ని ఆ కూటమే ఊహించలేదని తెలుస్తోంది. నితీశ్ పాలన పట్ల జనంలో ఇంత సానుకూలత ఉన్నదని తెలిస్తే.. కాంగ్రెస్ పార్టీని కూటమిలో కలుపుకోకుండా.. దూరం పెట్టి ఉంటే.. ఆ 27 సీట్లు కూడా ఈ రెండు పార్టీలకే దక్కి ఉండేవనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అసలే కాంగ్రెసు అంటే కోపం ఉన్న లాలూ అండ్ కో.. వారికి సీట్లు ఇవ్వాల్సి వచ్చినందుకు బాధపడుతున్నారట.
మోడీ హవా ఇంత ఉంటుంది.. అంత ఉంటుంది.. అంటూ అందరూ భయపడిన తీరు చూస్తే.. ఏనుగు గురించి మన పల్లెటూర్లలో చెప్పుకునే ఒక మొరటు సామెత లాగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.