లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాల దారుణమైన పర్ఫార్మెన్స్ చూసినవారంతా మోదీకి రాహుల్ ఏమాత్రం పోటీ ఇవ్వలేరని తేల్చేశారు.. స్వయంగా రాహుల్ గాంధీకి కూడా ఆ విషయం అర్థమై రాజీనామా చేస్తానంటూ కాసింత హడావుడి చేశారు. కానీ... కాంగ్రెస్ మిత్ర పక్షమైన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఇంకా రాహుల్ గాంధీని వెనకేసుకొస్తున్నారు. రాహుల్ గాంధీ తప్పేమీ లేదని.. ఆయనే తమ ప్రధానమంత్రి అభ్యర్థని ముందే ప్రకటించి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవంటున్నారు. దీంతో ముందే చెప్పుంటే ఈ మాత్రం సీట్లు కూడా వచ్చేవి కావని మహాఘట్ బంధన్‌లోని నాయకులు సెటైర్లు వేస్తున్నారంట.
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే ఇంకా నష్టం జరుగుతుందని.. అది ఆత్మహత్యా సదృశ్యం వంటిదేనని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే కాక సంఘ్ పరివార్ కు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలన్నింటికీ ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్ పత్రికతో మాట్లాడిన లాలూ ప్రసాద్ యాదవ్.. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయానికి విపక్షాల మూకుమ్మడి వైఫల్యమే కారణమని అన్నారు. వ్యూహాత్మక తప్పిదాలు - చర్యల వల్లే బీజేపీని నిలువరించలేకపోయామని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తమ ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటించకుండా పెద్ద తప్పు చేశామన్నారు. వరుడు లేకుండానే పెళ్లి బారాత్ నిర్వహించినట్లుగా తమ పరిస్థితి తయారైందన్నారు.
అయితే.. లాలూ వ్యాఖ్యలపై సెటైర్లు పడుతున్నాయి. ముందే ప్రకటించి ఉంటే ఇంకా దెబ్బయిపోయేవారని సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ పేరు ప్రకటించినా ప్రకటించకపోయినా జనానికి ఆయనే విపక్షాల ప్రధాని అభ్యర్థి అని తెలుసని.. అలాంటిది రాహుల్ పేరు ప్రకటించడం ఆలస్యం కావడం వల్ల ఓడిపోయాం అనడం కుంటిసాకని అంటున్నారు. కాగా... లాలూ మాత్రం మోదీ గెలుపుపై చాలా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అన్నిరకాలుగా విఫలమైనా మోదీకి ఇంత మెజారిటీ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.