వయసుకు మించి కష్టపడుతున్న లాలూ

Update: 2015-11-03 09:51 GMT
బీహార్ రాజకీయాల్లో కురువృద్ధుడు అనిపించుకుంటున్న రాష్టీయ జనతాదళ్ (ఆర్డేడీ)  అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డబుల్ సెంచరీ చేశారు. బీహార్ లో ఎన్నికలు మంచి వేడివేడిగా సాగుతున్నప్పుడు ఈయన క్రికెట్ ఆడుకుంటున్నారేంటి అనుకోవద్దు... ఆయన చేసిన డబుల్ సెంచరీ క్రికెట్ కు సంబంధించింది కాదు. రాజకీయాల్లోనే ఆయన డబుల్ సెంచరీ చేశారు.

బీహార్ ఎన్నికల బరిలో బీజేపీకి గట్టి దెబ్బ తినిపించాలన్న లక్ష్యంతో ఉన్న లాలూ ఎలక్షన్లలో వయసుకు మించి కష్టపడుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆయన పెద్దసంఖ్యలో ర్యాలీల్లో పాల్గొంటున్నారు. గత వారానికే ఆయన 200 ర్యాలీల్లో పాల్గొని తనదైన శైలిలో మాట్లాడారట.

బీహార్ లో ఇప్పటి వరకు ఐదు విడతల పోలింగ్ లో నాలుగు విడతలు పూర్తి కాగా  ఐదో విడత పోలింగ్ జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం సాగుతుంది . గత వారానికే 200 ప్రసంగాలు చేసిన లాలూ , ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 250 వేదికలపై మాట్లాడుతారని తెలుస్తుంది. ఇదేమైనా రికార్డేమో అన్న యాంగిల్ లో ఆర్జేడీ నేతలు గిన్నిస్ బుక్ వారిని సంప్రదిస్తున్నారట.
Tags:    

Similar News