ప్రపంచంలోని పలు రికార్డులను తన ఖాతాలో జమ చేసుకునే అగ్రరాజ్యం అమెరికా ఖాతాలో ఓ దురదృష్టకర రికార్డు చేరింది. అదే తాజాగా లాస్ వెగాస్ లో జరిగిన కాల్పుల ఘటన. లాస్ వెగాస్ లో జరిగిన కాల్పుల ఘటనతో మ్యూజిక్ షో కాదు.. అది హారర్ షోగా మారింది. మండాలే బే హోటల్ లో జరిగిన కాల్పులలో 50 మందికి పైగా మృతిచెందారు. మరో 200 మంది గాయపడ్డారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత దారుణ మారణహోమ కాల్పుల ఘటనగా రికార్డు అయ్యింది.
వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ సాయుధుడి కాల్పుల కారణంగా సంగీత ప్రేక్షకులకు కాళరాత్రిగా మారింది. రౌట్ 91 కౌంటీ మ్యూజిక్ ఫెస్టివల్ లోని చివరి రోజున.. అది కూడా చివరి ఫర్ఫార్మెన్స్ జరుగుతున్న సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మండాలే బే హోటల్ సమీపంలో ఉన్న 15 ఎకరాలో పచ్చిక మైదానంలో గత నాలుగేళ్ల నుంచి ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. సింగర్ జేసన్ ఆల్డన్ స్టేజ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఆటోమెటిక్ వెపన్ గన్ ఫైర్ ఆ స్టేడియంలో మారుమోగింది. మెషీన్ గన్ శబ్ధాలు.. ఓ బాణాసంచా మాదిరిగా వినిపించినట్లు అక్కడున్న ప్రేక్షకులు చెప్పారు. కన్ సర్ట్ దగ్గర కాల్పులకు పాల్పడిన వారిలో కొంత మంది ఉంటారని ముందుగా అంచనా వేశారు. అయితే చాలా మంది సాయుధులు లేరని - కేవలం ఒక్కరే కాల్పులకు తెగించినట్లు ఆ తర్వాత పోలీసులు తేల్చారు. సంగీత ప్రేక్షకులపై దాడికి పాల్పడిన వ్యక్తిని స్టీఫెన్ పడాక్ గా గుర్తించారు. అతని వయసు 64 ఏళ్లు. మండాలే బే హోట్ లోని 32వ అంతస్తులో అతన్ని షూట్ చేశారు. పడాక్ తో అనుబంధం ఉన్న మరో అనుమాతుడు మారిలౌ డాన్లేను గుర్తించినట్లు లాస్ వెగాస్ పోలీస్ చీఫ్ జో లంబార్డో తెలిపారు. హోటల్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెవడా లైసెన్స్ ప్లేట్ తో ఉన్న హుందయ్ టస్కన్ - క్రిస్లర్ పస్ ఫికా వాహనాన్ని సీజ్ చేశారు.
కాల్పుల ఘటన జరగ్గానే అక్కడకు స్వాట్ పోలీసులు చేరుకున్నారు. హెండర్సన్ - నార్త్ లాస్ వెగాస్ యూనిట్లు అక్కడకు చేరుకున్నాయి. సమీప హోటల్లలో ఉన్న గెస్ట్‌లను రూమ్ ల్లోనే ఉండాలని పోలీసులు ఆదేశించారు. బిల్డింగ్ సమీప ప్రాంతాలకు ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. లాస్ వెగాస్ లోని బ్లూ డైమండ్ రోడ్ - చార్లెటన్ బోలివర్డ్ రహదారులను మూసివేశారు. సాయుధ వ్యక్తి స్టీఫెన్.. 32వ అంతస్తు నుంచి సంగీత విభావరికి వచ్చిన ప్రేక్షకులపై కాల్పులు జరిపాడు. అంబులెన్సులు - హెలికాప్టర్లు అక్కడున్న క్షతగాత్రులను తరలించాయి. మెక్‌కారన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే సుమారు 25 విమానాలను రద్దు చేశారు. లాస్ వెగాస్ కన్ సర్ట్ కు హాజరైన ఓ పోలీస్ ఆఫీసర్ కూడా సాయుధుడి కాల్పులకు బలయ్యాడు.