ఫస్ట్ టైమ్ తన స్టైల్ కి భిన్నంగా జగన్...?

Update: 2022-04-01 23:30 GMT
ఎస్ జగన్ అంటేనే రొటీన్ కి పూర్తి యాంటీ. ఆయన తన రూటే సెపరేట్ అన్నట్లుగా ఉంటారు. ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా అది అమలు కావాల్సిందే. అవతల వారు పాటించాల్సిందే. ఇదే ఇప్పటిదాకా జరుగుతూ వస్తోంది. కానీ ఫస్ట్ టైం జగన్ తన మైండ్ సెట్ కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తనతో 34 నెలల పాటు పనిచేసి మాజీలు అవుతున్న మంత్రులతో లంచులు, డిన్నర్లకు జగన్ రెడీ అవుతున్నారు.

వారితో మనసు విప్పి మాట్లాడబోతున్నారు. అలాగే వారితో సిట్టింగులు వేయబోతున్నారు. నిజంగా జగన్ లో కొత్త కోణంగానే దీన్ని. ఏప్రిల్ 11 మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం అనుకుంటే ఇప్పటికి సరిగ్గా పది రోజులు కూడా లేదు సమయం. అదే టైం లో వారితో మనసు విప్పి మాట్లాడబోతున్నారు. అలాగే వారితో సిట్టింగులు వేయబోతున్నారు. నిజంగా జగన్ లో కొత్త కోణంగానే దీన్ని. ఏప్రిల్ 11 మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం అనుకుంటే ఇప్పటికి సరిగ్గా పది రోజులు కూడా లేదు సమయం. అదే టైం లో మంత్రుల పదవికి కూడా కౌంట్ డౌన్ మొదలవుతోంది.

అంటే వారు మాజీలు అవుతారన్న మాట. ఈ మాజీలయ్యే మంత్రుల‌తో జగన్ వరస భేటీలు నిర్వహించబోతున్నారని అంటున్నారు. ఈ నెల 7, 8 తేదీలలో మాజీలు కాబోతున్న వారందరితో జగన్ వన్ టూ వన్ మాట్లాడుతారు అని అంటున్నారు. ఈ సందర్భంగా వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అదే విధంగా వారికి ఏమైనా ఇబ్బందులు అసంతృప్తులు ఉంటే వాటిని లేకుండా చూస్తారు.

ఇక పార్టీ పదవులు ఇవ్వడంతో పాటు మీకే ప్రాధాన్యత అని కూడా చెబుతారు అంటున్నారు. నిజానికి జగన్ మనస్తత్వానికి భిన్నమైన తీరు ఇది. ఆయన ఎపుడూ ఇలా ముఖా ముఖీ భేటీలు చర్చలు జరపలేదు. కానీ ఈసారి రోటీన్ కి భిన్నంగా చేస్తున్నారు. దాంతో జగన్ లో ఏమిటీ మార్పు అని అంతా అనుకుంటున్నారు.

అయితే వచ్చే ఎన్నికలు వైసీపీకి చాలా ముఖ్యం. పైగా మూడేళ్ల పాలన తరువాత సహజంగానే వ్యతిరేకత వచ్చింది. ఇపుడు మంత్రులుగా చేసిన వారు రేపటి రోజున అసమ్మతి వెళ్ళగక్కితే ఇంకా కొత్త తలనొప్పులు వస్తాయి. దంతో ఆయన కూడా చంద్రబాబు మాదిరిగానే పార్టీలో  ఇంటర్నల్ గా ఉండే ప్రాబ్లమ్స్ ని ముందు సరిచూసుకోవాలనుకుంటున్నారు అని అంటున్నారు. ఏమైనా కూడా ఈ మార్పు మంచిదే అంటున్నారు. చూడాలి మరి జగన్ వన్ టూ వన్ చర్చలలో మాజీలు ఏం చెబుతారో, వారిని ఎలా కలుపుకుని వెళ్తారో.
Tags:    

Similar News