ఆ ప‌నిచేస్తే.. మ‌ళ్లీ సీఎం జ‌గ‌నే!!

Update: 2022-03-22 02:30 GMT
మ‌ళ్లీ మ‌ళ్లీ తానే ముఖ్యమంత్రిగా ఉండాల‌ని... వ‌చ్చే 30 ఏళ్లు ఏపీని పాలించాల‌ని బావిస్తున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు త‌న క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు ఇప్పుడు అద్భుత‌మైన అవ‌కాశం ఉంది. అదేంటం టే.. ఏపీలో సుదీర్ఘ‌కాలంగా స‌మ‌స్య‌గా ఉన్న రైతుల‌కు పాస్ బుక్‌ల వ్య‌వ‌హారాన్ని ఆయ‌న ప‌రిష్క‌రించ‌గ‌లి గితే.. తిరుగులేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. రైతుల‌కు ప్ర‌త్యేకంగా రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేయంతోపాటు... వారి స‌మ‌స్య‌ల‌పై త‌క్ష‌ణం స్పందించేం దుకు.. ఒక టెలిఫోన్ నెంబ‌ర్‌ను కూడా ఇచ్చారు.

అయితే.. ప్ర‌భుత్వాలు ఎన్నిమారినా.. రైతుల‌కు తీవ్ర స‌మ‌స్య‌గా ఉన్న పాస్‌పుస్త‌కాల విషయం మాత్రం ప‌రిష్కారం కావ‌డం లేదు. దీనికి అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. రెవెన్యూరికార్డుల ప్ర‌కారం రైతుల రికార్డులు స‌రిగా లేక‌పోవ‌డం, అదేవిధంగా పాస్ పుస్త‌కాలు ఇవ్వాలంటే.. పెద్ద ఎత్తున డ‌బ్బులు వ‌సూలు అవుతున్నాయ‌ని.. అంత డ‌బ్బులు ఇచ్చే ప‌రిస్థితి చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కు లేక‌పోవ‌డంతో.. రైతుల‌కు అత్యంత కీల‌క‌మైన పాస్ పుస్త‌కాల వ్య‌వ‌హారం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌విధంగా మారిపోవ‌డం తోపాటు.. ఇబ్బందులు కూడా ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది.

ఇక‌, రైతుల విష‌యానికి వ‌స్తే..  పాత‌కాలం వాళ్లు చాలా మంది ప‌ట్టా చేసుకోలేదు. మ‌రీ ముఖ్యంగా చాలా గ్రామాల్లో చుక్క‌ల భూములు(వీటిని బ్రిటీష్ ప్ర‌భుత్వంలో కొంద‌రు గ్రామాధికారుల‌కు కేటాయించిన భూములు), అసైన్‌మెంట్‌భూములు(నిర్దిష్ట అవ‌స‌రం కోసం కేటాయించిన భూములు) ఉన్నాయి. దీంతో చాలా మంది రైతుల‌కు వీటికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో రెడ్ మార్క్ ప‌డింది. దీంతో ఇలాంటి రైతుల‌కు పాస్ బుక్‌లు ఇవ్వ‌డం లేదు. ఈ సమ‌స్య దాదాపు 50 ఏళ్ల‌కు పైగానే ఉంది. వాస్త‌వానికి చాలా ప్ర‌భుత్వాలు వీటికి కూడా పాస్‌బుక్‌లు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించినా.. రెవెన్యూ చ‌ట్టాలు దీనిని అంగీక‌రించ‌డంలేదు.

మ‌రోవైపు... ప్ర‌భుత్వాలు నిర్మిస్తున్న నీటి పారుద‌ల  ప్రాజెక్టుల‌కు కూడా రైతుల‌కు చెందిన భూముల‌ను తీసుకుంటున్నారు. అయితే.. వాటిలో పాస్‌బుక్ ఉంటేనే ప్ర‌భుత్వం రైతుల‌కు ప‌రిహారం ఇస్తుంది. లేక‌పోతే... అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పంట‌ల‌కు ప‌రిహారం కింద అంతో ఇంతో ఇచ్చి చేతులు దులుపుకొన్న ప‌రిస్థితి ఉంది. దీంతో పాస్‌బుక్‌లు లేక‌.. త‌రాల త‌ర‌బ‌డి వాటిపై ఆధార‌ప‌డిన రైతుల కుటుంబాలు.. అన్యాయానికి గుర‌వుతున్నాయి. వెలిగొండ‌, పోల‌వ‌రం ప్రాజెక్టుల కింద తీసుకున్న భూముల్లో ఇలాంటి వి కూడా ఉన్నాయి.

దీంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు.. భూములు ఇచ్చినా.. ప్ర‌భుత్వాలు ప్రాజెక్టులు క‌ట్టినా.. ఇంత వ‌ర‌కు 70 శాతం మంది రైతుల‌కు న్యాయం జ‌ర‌గ‌లేదు. ఒక్క‌పైసా కూడా వారికి చేర‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇలాం టి రైతులు వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వం త‌మ‌కు ఏదైనా న్యాయం చేయాల‌ని కోరుతున్నారు. ప్ర‌స్తుతం గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు ప్ర‌భుత్వం ప్రారంభించిన నేప‌థ్యంలో వాటి ద్వారా.. ప‌రిశీలించి.. ఇలాంటివాటిని ప‌రిష్క‌రించే అవ‌కాశం ఉంద‌ని రైతులు చెబుతున్నారు.

రైతుల‌కు ఎలిజిబిలిటీ ప్ర‌కారం.. వాళ్ల‌కు పాస్ బుక్స్ వ‌స్తే.. త‌మ‌కు అంతో ఇంతో న్యాయం చేసిన‌ట్టు అవుతుంద‌ని.. రైతు సంఘాలు కూడా చెబుతున్నాయి. ఫ‌లితంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఏదైనా త‌మ‌ది రైతు ప్ర‌భుత్వం అని జ‌గ‌న్ చెబుతున్నారో..అది సాకారం అవుతుంద‌నికూడా అంటున్నారు. ఇదే క‌నుక జ‌గ‌న్ స‌ర్కారు ఒకింద సాహ‌సోపేత  నిర్ణ‌యం తీసుకుని సాకారం చేస్తే..రైతులు అంద‌రూ.. అ ప్ర‌భుత్వాన‌నికి అండ‌గా ఉండే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. దీంతో మ‌రోసారి బంపర్ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకునే ఛాన్స్ ఉంద‌ని కూడా రైతులు చెబుతున్నారు.

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల‌కు అన్ని విధాలా సాయం చేస్తున్నాన‌మని, ఇన్‌పుట్ సబ్సిడీ నుంచి.. ధాన్యం ఇత ర పంట‌ను కూడా కొనుగోలు చేస్తున్నామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం... ఇలాంటి కీల‌క‌మైన పాస్ బుక్‌ల విష‌యంలోనూ నిర్ణ‌యం తీసుకుంటే.. రైతులు.. త‌మ జీవితాతం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అండ‌గా ఉంటార‌న‌డంలో సందేహం లేద‌ని.. వ్య‌వసాయం రంగ నిపుణులు కూడా చెబుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News