ప్రత్యేకహోదాపై చర్చించేందుకు కమిటీ వేయాలి

Update: 2022-02-15 06:06 GMT
రాష్ట్ర విభజన విషయంపై ఈనెల 17వ తేదీన జరగబోయే కీలకమైన సమావేశం అజెండా మార్పు  విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశంలో చర్చకు మొదట తొమ్మిది అంశాలతో అజెండా డిసైడ్ అయ్యింది.   ఈ అజెండాను సెట్ చేసింది హోంశాఖ ఉన్నతాధికారులే. ఈ తొమ్మిది అంశాల్లో ప్రత్యేక హోదా కూడా ఒకటి. అయితే తెరవెనుక ఏమి జరిగిందో తెలీదు కానీ తొమ్మిది అంశాల ఎజెండా ఐదుకు కుదించుకుపోయింది.

 అజెండా కుదించుకుపోవటంతో పాటు ప్రత్యేక హోదా అంశం కూడా మాయమైపోయింది. మొదటి అజెండా వెలుగు చూడగానే ప్రజలంతా చాలా హ్యాపీ ఫీలయ్యారు. విభజన జరిగిన ఎనిమేదళ్ళ తర్వాతైనా రాష్ఠ్రానికి మంచి జరుగుతోందని ఆశించారు. అలాంటిది ఎప్పుడైతే సీన్ రివర్సయ్యిందో జనాల్లో మంటలు మొదలయ్యాయి. దాంతో రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే ఇలా జరిగిందనే అభిప్రాయం   జనాల్లో కూడా పెరిగిపోయింది.

 అజెండా మార్పుకు చంద్రబాబునాయుడు ప్రభావంతో జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేష్ లే కారకులంటూ గోల మొదలైపోయింది. ఇదే విషయమై జీవీఎల్ హోంశాఖకు లేఖ రాశారు. అజెండా కుదింపు వల్ల జనాల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోతోందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రెవిన్యు, ఇతర అంశాల తొలగింపుకు కారణం చెప్పాలంటు ఉన్నతాధికారులను జీవీఎల్ లేఖలో డిమాండ్ చేశారు.

అజెండాలో సవరణల కారణంగా రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన గందరగోళం పెరిగిపోతోందని జీవీఎల్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకనే ప్రత్యేక హోదా పై చర్చించేందుకు ఒక కమిటీని నియమించాలని ఎంపీ లేఖలో అడిగారు.

అజెండా కుదింపు కారణంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ కేంద్ర ప్రభుత్వ దగ్గర చర్చకు రావనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోందని ఎంపీ చెప్పారు. మొత్తం ఎపిసోడ్ ను గమనిస్తే అజెండా కుదింపు వెనుక ఏదో జరిగిందనే అనుమానాలైతే ఉన్నాయి. ఎందుకంటే అజెండాలో చేర్చాల్సిన అంశాలేమిటో తెలీకుండానే ఉన్నతాధికారులు చేర్చేశారంటే ఎవరు నమ్మటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజంగానే ఉన్నతాధికారులు పొరబాటు చేశారనే అనుకుంటే జీవీఎల్ ఓవర్ యాక్షన్ వల్లే సమస్య పెద్దదైంది.

 అజెండా కుదింపు విషయంపై జీవీఎల్ కాకుండా ఉన్నతాధికారులే వివరణ ఇచ్చుంటే సరిపోయేది. అలా కాదని విషయం తెలియగానే తాను ఉన్నతాధికారులతో మాట్లాడానని పొరబాటున అజెండాలో ప్రత్యేక హోదా, రెవిన్యు అంశాలను చేర్చినట్లు తనతో  చెప్పారని జీవీఎల్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఆ చెప్పేదేదో ఉన్నతాధికారులే చెప్పుకునుంటే ఇపుడీ వివాదం రేగేదే కాదు.

 
Tags:    

Similar News