మొదటిసారిగా మిత్రపక్షాల పై బీజేపీ-జనసేన ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగబోతోంది. ఈనెల 19వ తేదీన రెండు పార్టీల నేతృత్వంలో కడపలో రణభేరి పేరుతో బహిరంగ సభ జరగబోతోంది. సోమవారం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. ఇది పూర్తిగా జనసేన పార్టీ కార్యక్రమం. అందుకనే ఐదురోజుల గ్యాప్ లోనే కడపలో రెండు పార్టీలు కలిపి బహిరంగ సభ నిర్వహించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.
పేరుకు రెండు పార్టీలు మిత్రపక్షాలే కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి నిర్వహించిన కార్యక్రమాలు పెద్దగా లేవనే చెప్పాలి. రెండు పార్టీల నేతల సమావేశాలు కూడా దేనికవే జరుగుతున్నాయి. చివరకు మీడియా సమావేశాలు కూడా విడివిడిగానే నిర్వహిస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాతే ఎక్కువ కాలం రెండు పార్టీలు కలిసుండే అవకాశాలు లేవనే ప్రచారం పెరిగిపోతోంది.
సరిగ్గా ఈ సమయంలోనే పవన్ కు చంద్రబాబు నాయుడు లవ్ ప్రపోజల్ పంపారు. వీలైతే రెండు పార్టీలతో తాను కూడా చేతులు కలపాలన్నది చంద్రబాబు ఆలోచన. అది సాధ్యం కాకపోతే మిత్రపక్షాలను విడదీసీ జనసేనను తమవైపు లాక్కోవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది.
అందుకనే 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణే అని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. అంటే తమతో పొత్తును పవన్ ఎక్కడ తెంపుకుని టీడీపీ వైపు వెళిపోతారో అనే ఆందోళన బీజేపీలో ఉందని అర్ధమవుతోంది.
ఇన్ని గందరగోళాల మధ్యే జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. పార్టీ నేతల సమాచారం ప్రకారం బీజేపీకి ఆహ్వానం పంపినట్లు లేదు. అందుకనే రెండు పార్టీల నేతృత్వంలో కడపలో 19వ తేదీన రణభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ బాధ్యుడు సునీల్ దేవదర్ ప్రకటించారు.
బహిరంగ సభ వీళ్ళు ఎంచుకున్న స్థలం కూడా వ్యూహాత్మకమనే అనిపిస్తోంది. నిజానికి పార్టీలో కష్టపడి పనిచేసే, జనాల్లో పట్టున్న నేతలు కాగడా పెట్టి వెతికినా పెద్దగా కనబడరు. కానీ టీవీ, మీడియా సమేవేశాల్లో మాత్రం చాలామంది కనబడతారు. మొత్తానికి మిత్రపక్షాల మొదటి బహిరంగ సమావేశం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పెడుతున్నారు. చూద్దాం సభలో జనాలకు ఏమి చెబుతారో ?