ఉగాది నుంచి గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించాలని, జనం మధ్యలోనే ఇంకా చెప్పాలంటే విశేష ప్రజా వాహిని మధ్యలో ఎమ్మెల్యేలు ఉండాలని, వారితో పాటు ఎంపీలు కూడా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆదేశించారు. ఇదంతా మొన్నటి వేళ జరిగిన దిశానిర్దేశం.
ఈలోగా ఏ మార్పులు వచ్చాయో కానీ ఉగాది వేళ అయితే కొత్త జిల్లాలు ఆరంభం అయ్యాయి కానీ గడపగడపకూ వైఎస్సార్ ప్రొగ్రాం మాత్రం మొదలుకాలేదు. ఎప్పుడు మొదలవుతుందో అన్నది స్పష్టం కాలేదు. ఇదే సమయంలో సీఎం కొంచెం బిజీ అయిపోయారు. నిన్నటి వేళ అనగా ఏప్రిల్ ఐదున మోడీతో భేటీ అనంతరం చాలా విషయాలు ఢిల్లీ కేంద్రంగా చర్చించి వచ్చారు.
అటుపై తాజాగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ తో భేటీ కానున్నారు. ఈ విధంగా ఆయన వరుస భేటీలతో పూర్తిగా సమయాన్ని క్యాబినెట్ మార్పు కోసం మరియు రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చే విషయమై వెచ్చిస్తున్నారు. కానీ ఇంతటి స్థాయిలో మంత్రులు ఉన్నారా అన్న సంశయం ఉంది.
ఈ నెల 11న కొత్త మంత్రివర్గం కొలువు దీరనున్న నేపథ్యంలో పాపం పాత మంత్రులు అంతా ఇళ్లకే పరిమితం కానున్నారు. అలా అని వారిని పక్కనబెట్టరని, పార్టీలో క్రియాశీలక బాధ్యతలు అప్పగించి జిల్లా ఇంఛార్జులుగానూ, రీజనల్ కో-ఆర్డినేటర్లుగానూ నియమిస్తారని తెలుస్తోంది. అంటే ఈ పదవులు మంత్రి పదవుల కన్నా గొప్పవా అని ఆశ్చర్య పోవద్దు.. ఇవి సమర్థంగా నిర్వహిస్తేనే సంబంధిత బాధ్యతలు అత్యంత శ్రద్ధతో నిర్వర్తిస్తేనే వచ్చే రోజుల్లో వీరికి అంటే 2024 లో కొలువు దీరబోయే జగన్ 3.0 వెర్షన్లో చోటుంటుంది.
అందాక వీళ్లు కష్టపడాల్సిందే! గెలుపు కోసం ముఖ్యంగా పార్టీ గెలుపు కోసం, నియోజకవర్గాలలో సంక్షేమ పథకాల అమలులో లోపాలు లేకుండా చేయడం కోసం, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం పనిచేయాల్సిందే! ఇంతగా వీళ్లు కష్టపడ్డాక అప్పుడు మంత్రి పదవులు దక్కేందుకు వీలుంది.
ఇక జగన్ జిల్లాల పర్యటనపై ఇప్పటిదాకా క్లారిఫికేషన్ లేదు. కానీ జగన్ కన్నా ముందే పవన్ జిల్లాలకు రానున్నారు. ఆత్మ హత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందించనున్నారు. ఇందుకు ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే సొంత ఖాతా నుంచి విడుదల చేసి తనదైన నిబద్ధతను చాటుకున్నారు. ఈ నెల 12న అనంతపురం నుంచి పరామర్శ యాత్ర ప్రారంభించనున్నారు. అంటే జగన్ కన్నా ముందే పవన్ వస్తున్నారు.