పవన్ కి ఢిల్లీ ఫోన్... ఆపరేషన్ ఏపీ ....?

Update: 2022-03-10 17:30 GMT
ఇలా ఉత్తరాదిలో విజయకేతనం ఎగురవేశారో లేదో అలా  ఏపీ మీద బీజేపీ పెద్దల ఫోకస్ పడింది అంటున్నారు. ఏపీలో అధికారంలోకి బీజేపీ ఎలా రావచ్చు అన్నది ఎవరికైనా డౌట్లు పుట్టొచ్చు కానీ కమలనాధులకు మాత్రం అలాంటివి అసలు లేవు. వారు దానికి చెప్పే జవాబు ఒక్కటే. జనాలు మార్పు కోరుకుంటే కచ్చితంగా అది సాధ్యపడుతుంది. దాని కోసం చేయాల్సింది అంతా చేద్దాం, చివరి చాన్స్ ని కూడా వదిలిపెట్టవద్దు.

ఇదే బీజేపీ ఫిలాసఫీ. దాన్ని నమ్ముకునే కేవలం రెండు సీట్లు ఉన్న పార్టీ ఈ రోజునకు దేశంలో బలమైన పార్టీగా ఎదిగింది. ఇక ఏపీలో బీజేపీ ఆశలు పెంచే ఆయుధం పవన్ కళ్యాణ్. ఆయన పవర్ ఫుల్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్. ఇక రాజకీయాల్లో చూసుకున్న బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.

అందుకే పవన్ని ముందు పెట్టి ఏపీ పాలిటిక్స్ ని తన వైపునకు తిప్పుకోవాలని ఎత్తులు వేస్తోంది. ఇక యూపీ టూ ఏపీ దిశగా బీజేపీ పెద్దల ఆలోచనలు మళ్ళుతున్నాయని అంటున్నారు. రెండు రోజుల తేడాలో పవన్ కి ఢిల్లీ నుంచి నేరుగా ఫోన్ వస్తుంది అని అంటున్నారు. ఇంతకాలం పవన్ కి ఢిల్లీ పెద్దలు సరిగ్గా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. పవన్ సైతం లోకల్ లీడర్ల వైఖరితో విసిగిపోయారని అంటారు.

బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా ఆయన మిత్ర పక్షం బీజేపీతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నుంచే ఈ ఎడబాటు అలా మొదలై  ఇపుడు కధ క్లైమాక్స్ కి చేరుకుంది. ఇక పవన్ బీజేపీ గూటిని వీడబోతున్నారు అన్న ప్రచారం జరుగుతున్న వేళ బీజేపీ పెద్దలు ఉత్తరాది ఫలితాల జోష్ లో ఫుల్ అలెర్ట్ మీద ఉన్నారు.

ఏపీలో పవన్ని ఇక మీదట పూర్తిగా పట్టించుకోవాలని, ఆయనతోనే అంతా అన్నట్లుగా ఏపీలో పాలిటిక్స్ నడిపించాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక పవన్ తో బీజేపీ పెద్దల భేటీలో ఆయనను పూర్తిగా కార్యోన్ముఖుడిని చేయాలని కూడా  చూస్తున్నారు. ఏపీలో బీజేపీ జనసేన కూటమికి పవనే సీఎం  అభ్యర్ధి అని ఢిల్లీ పెద్దలే నేరుగా పవన్ కి చెబుతారు అంటున్నారు.

ఆ మీదట రెండు పార్టీలు కలసి ఏపీలో మరింత దూకుడుగా రాజకీయం చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారు అంటున్నారు. చూడబోతే ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభ ఉంది. దాని కంటే ముందే పవన్ కి ఢిల్లీ పిలుపు వస్తుంది అని అంటున్నారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ టీడీపీ వైపు మొగ్గకుండా చూడడమే ఇపుడు కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచన‌గా ఉందిట.

ఈ క్రమంలో పవన్ వైపు నుంచి కూడా ఏమైనా చేయాల్సి ఉంటే చేసేందుకు కూడా బీజేపీ పెద్దలు సిద్ధమని తెలుస్తోంది. మొత్తానికి ఉత్తరాది రిజల్ట్స్ కాదు కానీ పవన్ కి ఏపీలో ఫుల్లుగా ఇంపార్టెంట్స్ ఇవ్వాలని కాషాయ పెద్దలు నిర్ణయించడం అంటే నిజంగా జనసైనికులకు ఇది శుభవార్తే.
Tags:    

Similar News