రాజకీయాల్లో విమర్శలు.. ఆరోపణలు కామన్. కానీ.. కొందరు నేతలకు కొంతమంది మీద విరుచుకుపడమంటే విపరీతమైన ఉత్సాహం పొంగుకు వస్తుంటుంది. ఆ కోవలోకే వస్తారు మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రిగా ఉన్న వేళ.. పవన్ ను తరచూ ఏదో ఒక మాట అనకుండా ఉండని వైసీపీ నేతల్లో ఆయన తొలి వరసలో ఉంటారు.
పవన్ ను ఎన్ని విధాలుగా తిట్టాలో.. మరెన్ని రకాలుగా బద్నాం చేయాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ పై పేర్ని నానిని ప్రయోగించటం.. అది కాస్తా సక్సెస్ కావటం తెలిసిందే. తరచూ పవన్ పై నోరు పారేసుకునే నాని.. పదవి పోయాక కూడా తన తిట్ల తీరును మార్చుకోలేదు.
పదవిలో ఉన్నప్పుడు అధినేత మనసును దోచుకోవటానికి పడే ప్రయాసను అర్థం చేసుకోవచ్చు. పదవి పోయిన తర్వాత.. తన గురించి ఆలోచించటం మానేసి పవన్ మీద అదేపనిగా పడిపోవటాన్ని ఆయన ఆపలేదు. ఇటీవల ఓట్ల చీలికపై పవన్ స్పష్టత ఇవ్వటం తెలిసిందే.
దీనిపై తాజాగా మాట్లాడిన నాని.. పవన్ తీరును తప్పు పట్టారు. ఓట్ల చీలికపై ఆయన ఏమిటి మాట్లాడేది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వని ప్రకటిస్తే సరిపోతుందా? హాబీగా పాలిటిక్స్ చేసే పవన్ మాటల్ని అదే పనిగా తప్పు పట్టారు.
సాధారణంగా పార్టీ పెట్టాలనుకుంటే ఎన్నికల కమిషన్ ను కలుస్తారని.. కానీ పవన్ మాత్రం చంద్రబాబును కలిశానని చెప్పారంటూ ఎద్దేవా చేశారు. గతంలో పవన్ వెనుక చేగువేరా ఫోటో ఉండేదని.. ఇప్పుడు చంద్రబాబు ఫోటో పెట్టుకున్నాడన్నారు. బీజేపీ చంకలో ఉండి.. చంద్రబాబుకు కన్ను కొడతాడని.. గత ఎన్నికల సమయంలో సీపీఎం.. సీపీఐ ఇద్దరు పవన్ ను సీఎం అభ్యర్థిగా అన్నారని.. ఇప్పుడు వారెక్కడ ఉన్నారంటూ విమర్శించారు.
ఓవైపు ప్రేమ వ్యవహారం నడుపుతూనే కాపురం మాత్రం బీజేపీతో చేస్తారన్నారు. అయినా.. రాజకీయాల్లో కాపురాలు చేయటాలు.. ప్రేమ వ్యవహారాలు నడపటాలు లాంటివేమీ ఉండవు కదా.. ఉండేదంతా లెక్కలే కదా? ఇంత చిన్న లాజిక్ జనాలకు తట్టదన్నట్లుగా పేర్ని నాని నోరు పారేసుకోవటం ఆయనకు మంచిదేనా? రానున్న రోజులు ఆ విషయాన్ని ఇట్టే చెప్పేస్తాయని చెప్పాలి.