ఆంధ్రప్రదేశ్‌లోని కర్నులు జిల్లా రాజకీయాలంటే కచ్చితంగా కోట్ల కుటుంబం పేరు గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు. కర్నూలు జిల్లా రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన కుటుంబాల్లో కోట్ల కుటుంబం ఒకటంటే అతిశయోక్తి కానే కాదు. దివంగత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రెండు సార్లు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేశారు.
ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటిది ఇప్పుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేక దూరమవ్వాలని ఆయన భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఆ రెండు కుటుంబాలు..
కర్నులు రాజకీయాలంటే ముఖ్యంగా కోట్ల, కేఈ కుటుంబాల గురించే చెబుతారు. కేఈ కుటుంబంలో ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత ఎన్నికలకు ముందే ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆయన పోటీ చేయకుండా తన వారసులను, సోదరులను రంగంలోకి దింపారు. ఇప్పుడు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు రాజకీయాలు లేవనేది నిజం. డబ్బులతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉండాలి. ఇప్పుడా రెండు తన దగ్గర లేవని సన్నిహితుల దగ్గర కోట్ల వ్యాఖ్యానించినట్లు సమాచారం.
తాను తప్పుకుని..
ఈ పరిస్థితులను అంచనా వేసిన కోట్ల వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి తన సతీమణి సుజాతమ్మను, ఆలూరు నుంచి తన తనయుడిని బరిలో దించాలని ఆయన అనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. పైగా కర్నూలు జిల్లాలో టీడీపీ పరిస్థితి కూడా ఏమంతా మెరుగుపడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ, జనసేన కలిస్తే కొంత బలం చేకూరుతుంది.
ఈ నేపథ్యంలో తన మనసులోని మాటలను త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు కోట్ల చెప్తారని అంటున్నారు. మరోవైపు బాబు కూడా యువతకు ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నారు. ఒకవేళ ఆయన ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటే మాత్రం ఆలూరు నుంచి తన భార్యను రంగంలోకి దించాలని కోట్ల భావిస్తున్నట్లు సమాచారం. మరి కోట్ల కోరికను బాబు మన్నిస్తారో లేదో చూడాలి.