రష్యా గెలిచినట్లేనా..? ఉక్రెయిన్ కు సాయపడని ఇతర దేశాలు..

Update: 2022-02-25 02:31 GMT
ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా చేస్తున్న యుద్ధం విజయవంతమైనట్లా..? రష్యా దాడికి ఉక్రెయిన్ తట్టుకోలేకపోతుందా..? తనకు సహకరిస్తారన్న ఇతర దేశాలు.. కలిసి రావడం లేదా..? దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలేంటి..? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం పతాక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి నిర్వేదం చెందుతూ చేసిన ప్రకటనతో రష్యా అనుకున్న లక్ష్యం నెరవేర్చే దిశగా ముందుకెళ్తోందని తెలుస్తోంది. దీంతో ఉక్రెయిన్ ఒంటరి పోరాటానికి సిద్ధం అయింది. అయితే సోవియట్ ను ఉక్రెయిన్ ఎదుర్కొంటుందా..? ఏం చేయబోతుంది..?

ఉక్రెయిన్  అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కి ఇటీవల తన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశాడు. ఇందులో ‘రష్యాతో తాము ఒంటరి పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఒంటరిగా పోరాడడానికి భయపడట్లేదు. ఇతర దేశాల సహాయ సహకారాలు లేకుండా తమ దేశాన్ని కాపాడుకుంటాం. సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుంటాం. రష్యాను నిలువరించేందుకు ఏ దేశం ముందుకు రావట్లేదు. తమతో కలిసి వచ్చేవారు ఎవరూ లేరని అర్థమైంది. రష్యాతో పోరాడడానికి అందరూ భయపడుతున్నారు. ఇలాంటప్పుడు  నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ (నాటో)తో సభ్యత్వం ఎందుకు అడుగుతున్నారు..?’ అని జెలెస్కీ అన్నారు.

‘దేశంలో సైనికుల ముసుగులో విధ్వంస కారులు ప్రవేశించారు. రాజధాని కీవ్ లో అన్ని చోట్లా వ్యాపించారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. దేశంలో కర్ఫ్యూ వాతావరణం ఉంది. విధ్వంసకారులు అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. నన్నే లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు దిగుతోంది. రాజకీయంగా రష్యా అనుకున్నది సాధించడానికి ఇలాంటి విధ్వంసానికి పాల్పడుతోంది.’ అని అన్నారు. ‘ఇక తాను దేశం విడిచి వెళ్లారన్న వార్తలు నిజం కాదు. నేను దేశంలోనే ఉన్నాను. టార్గెట్ వన్ ను ఛేదించడమే రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. దేశాధ్యక్షుడిని లొంగదీసుకోవడం ద్వారా సైన్యాన్ని మానసికంగా దెబ్బతీయాలని రష్యా చూస్తోంది. అయితే రష్యా ఆగడాలను అడ్డుకుంటాం..’ అని వోలోదిమిన్ అన్నారు.

ఇదిలా ఉండగా ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు ఉక్రెయిన్ కు చెందిన 11 ఎయిర్ ఫీల్డ్స్, 18 రాడార్ స్టేషన్లు, మూడు కమాండ్ పోస్టులను ధ్వంసం చేసింది. ఎస్ 300 , బీయూకే ఎం1 యాంటి ఎయిర్ క్రాప్ట్ మిస్సైల్ వ్యవస్థ సహా ఉక్రెయిన్ సైన్యానికి చెందిన కీలక పోస్టులపై బాంబుల వర్షాన్ని కురిపించింది. పలు మిలటరీ హెలీక్యాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేల కూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కొనషెన్కోవ్ తెలిపారు.

అయితే రష్యాపై ఇంతటి దాడులు జరుగుతున్నా ఏ దేశం స్పందించలేదు. అయితే తాజాగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసినట్లు సమాచారం. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపేయాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రష్యా అధ్యక్షుడు మోదీ మాట వింటాడా..? అనేది ఆసక్తిగా మారింది. కానీ రష్యా మాత్రం తన పంతం నెగ్గే వరకు వెనక్కి తగ్గేది లేనట్లే కనిపిస్తోంది.

ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడి వీడియోతో ప్రపంచ దేశాలు కూడా స్పందిచే అవకాశం ఉందని అంటున్నారు. అంతకుముందు నాటో  సపోర్టు ఉంటుందని కొన్ని దేశాలు ప్రకటించినప్పటికీ అత్యవసర సమయంలో వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రష్యా ఉక్రెయిన్ పై పాగా వేయనుందా..? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రపంచ పెద్దన్నగా పేర్కొనే అమెరికా సైతం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

    

Tags:    

Similar News