వందేళ్లకు ఒకసారి విరుచుకుపడుతుందనే సంక్షోభం.. తాజాగా కొవిడ్ 19రూపంలో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మాయదారి కారణంగా కోట్లాది మంది ప్రభావితం కావటమే కాదు.. లక్షలాది మంది మరణించారు. లక్షల కోట్ల ఆర్థిక నష్టానికి కారణమైన కరోనా మనిషి జీవన గమనాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పక తప్పదు. ఇవాల్టి రోజున కొవిడ్ 19 పేరు చెప్పినంతనే ఉలిక్కిపడే పరిస్థితి. నేటికి మూడో వేవ్ ముప్పు ఉందన్న భయాందోళనలు అందరిలో ఎక్కువఅవుతున్నాయి. సాధారణంగా వందేళ్లకు ఒకసారి ఇలాంటి విపత్తులు విరుచుకుపడుతుంటాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
అందుకు భిన్నంగా తాజాగా వెల్లడైన ఒక అధ్యయనం షాకింగ్ నిజాన్ని బయటకు తీసుకొచ్చింది. ఈసారి వందేళ్లకు కాదు.. వచ్చే 60 ఏళ్లలో మరో ముప్పు పొంచి ఉందన్న మాట వినిపిస్తోంది. ఇటలీలోనిపడువా వర్సిటీ.. అమెరికాలోని డ్యూక్ వర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా ఇచ్చిన వార్నింగ్ కొత్త కలకలానికి తెర తీసింది. వారు చేసిన అధ్యయనంలో అత్యత అరుదుగా సంభవించే వైరస్ లు ఇప్పటి వరకు అందరూ భావిస్తున్నట్లు వందేళ్లకు ఒకసారి కాదు.. 60 ఏళ్లకు ఒకసారి తప్పంటున్నారు.
ఈ లెక్కన 2080లో మరో ముప్పు పొంచి ఉందన్న మాట వారి నోటి నుంచి వస్తోంది. దీనికి సంబంధించి విశేషాల్ని ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ఇంతకీ ఇలా ఎలా చెబుతారు? అన్న ప్రశ్న మదిలో మెదలొచ్చు. దీనికి సమాధానంచెబుతున్నారు శాస్త్రవేత్తలు. గడిచిన 400 ఏళ్లలోచికిత్స లేని మహమ్మారులకు సంబంధించిన గణాంకాల్నిసేకరించారు. వాటి ఆధారంగా భవిష్యత్తులో విరుచుకుపడే అవకాశం ఉన్న వైరస్ లెక్కలు తీశారు.
దీని ప్రకారం గతంలో విరుచుకుపడిన వైరస్ లు ఎంతకాలం మానవజాతిని వెంటాడాయి? వేధించాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికారు. తాజా అధ్యయనం వెల్లడించిన మరిన్ని ఆసక్తికర అంశాల్నిచూస్తే..
- ప్రపంచ దేశాలపై కోవిడ్–19 ఎలాంటి ప్రభావం చూపించిందో అలాంటి మహమ్మారి మళ్లీ ఏ సంవత్సరంలోనైనా రావడానికి 2% అవకాశం ఉందని.. ఈ లెక్కన 2000లో పుట్టిన వాళ్లలో కొందరు కరోనా తరహా వైరస్ కల్లోలాన్ని తమ జీవిత కాలంలో మరోసారి చూసే అవకాశం 38 శాతంగా ఉంది. మరికొందరికి 60 ఏళ్లు వచ్చేసరికి ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
- 50 ఏళ్లలో రకరకాల కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. వచ్చే మరికొన్ని దశాబ్దాల్లో కరోనా వంటి వైరస్‌లు బయల్పడే అవకాశం మూడింతలు ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం చూస్తే కరోనా లాంటి వైరస్ మరో 59 ఏళ్లకే వచ్చే ఛాన్స్ ఉంది. 1918–1920 మధ్య 3 కోట్ల మందిని బలితీసుకున్న స్పానిష్ ఫ్లూను మించిన ప్రాణాంతక వ్యాధి మరొకటి లేదు. మళ్లీ అలాంటి వ్యాధి సంభవించే ముప్పు ఏడాదికి 0.3 నుంచి 1.9% వరకు పెరుగుతూ ఉంటుంది. అంటే మళ్లీ 400 ఏళ్ల లోపు ఆ తరహా వ్యాధి బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది.
- మరో 12 వేల ఏళ్లలో మానవ జాతి యావత్తును నాశనం చేసే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాధుల ముప్పు అధికం కావడానికి జనాభా పెరుగుదల, ఆహార విధానంలో మార్పులు, పర్యావరణ ధ్వంసం.. వ్యాధికారక జంతువులతో మనుషులు కలిసిమెలిసి తిరగటం లాంటి కారణాలెన్నో.. మహమ్మారులు విరుచుకుపడటానికి అవకాశం ఇస్తున్నాయి.