సీదరి... అదృష్టం దరి

Update: 2022-04-11 08:35 GMT
ఆయన జగన్ కొత్త కొలువులో మరి మరో మారు మంత్రి అయ్యారు. ఆయన అదృష్టం, ప్రతిభ రెండూ పుణికిపుచ్చుకున్న  నాయకుడిగా చెప్పాలి. సిక్కోలు జిల్లాలోని  ఒక సాధారణ మత్య్సకార కుటుంబంలో జన్మించిన సీదరి అప్పలరాజు చదువుకునే రోజుల్లో కూడా టాప్ గానే ఉన్నారు.

ఆయన చదువుకునే రోజుల్లో ఏపీఆర్జేసీలో రెండవ ర్యాంక్ హోల్డర్. ఇక ఎంసెట్ లో స్టేట్ పదమూడవ ర్యాంక్, ఎంబీబీఎస్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించి తనకు సాటీ పోటీ లేరని చాటారు.

ఇపుడు చూస్తే ఆయన రాజకీయాల్లోనూ వరసబెట్టి  సిక్సర్లు కొడుతున్నారు. ఫస్ట్ టైమ్  2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే  అయిన సీదరి అప్పలరాజు భారీ మెజారిటీతో గెలిచారు. శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్రాలోనే ప్రతిష్ట కలిగిన రాజకీయ కుటుంబం గౌతు ఫ్యామిలీ మీద గెలిచి జెయింట్ కిల్లర్ అయ్యారు.

అదే  లక్ అనుకుంటే సరిగ్గా ఏడాది తరువాత ఎవరూ అనుకోని తీరున  మంత్రి అయ్యారు. తొలి విడతలో గెలిచిన వారిలో మంత్రి పదవిని చేపట్టిన లక్కీ మ్యాన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు.

ఇక విస్తరణలో కూడా చాలా మంది ఉద్ధండులు పదవులు కోల్పోయారు. అయినా సీదరి అప్పలరాజు తన పట్టు నిలుపుకుని మళ్లీ మినిస్టర్ కుర్చీ ఎక్కేశారు.

గత రెండేళ్ళ కాలంలో ఆయన మంత్రిగా తన ప్రతిభ చూపారు. అదే విధంగా జగన్ వద్ద మంచి మార్కులు వేయించుకున్నారు. మత్స్య కార సామాజిక వర్గంలో తిరుగులేని యువనేతగా ఎదురుతున్న సీదరి ఇపుడు అదృష్టం దరిలో ఉన్నారు. ఆయనను అధిగమించడం కష్టం అంటే అది వట్టి మాట కాదు. 2024 ఎన్నికల్లో కూడా పలాసా నుంచి గెలిచి నిలిచే సత్తా తన సొంతం అని సీదరి ధీమాగా చెబుతున్నారు.
Tags:    

Similar News