అతి పెద్ద విమానం ఇప్పుడు ఎలా ఉందొ చూసారా?

Update: 2022-03-05 08:48 GMT
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా తన దాడులు మరింత తీవ్రతరం చేస్తోంది. గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ యుద్ధంలో వందల మంది చనిపోయారు. మొదట ఉక్రెయిన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా.. ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ తో పాటు రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోని పలు నివాస ప్రాంతాలపై రష్యా బాంబులు విసిరింది. ర‌ష్యా చేస్తున్న ఈ దాడుల్లో ఉక్రెయిన్ కు చెందిన అతిపెద్ద విమానం కుప్ప‌కూలిపోయింది.

గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యా బలగాలు.. ఆ దేశ రాజధాని కీవ్ నగరమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ సాయుధ కాన్వాయ్‌ను శాటిలైట్  చిత్రాలు గుర్తించాయి. దీని పొడవు 65 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా, త‌న దాడుల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్ ఆంటొనొవ్ ఏఎన్-225ను ర‌ష్యా ధ్వంసం చేసింది.

మ్రియా పేరు క‌లిగిన ఈ విమానానికి ఉక్రెయిన్ భాష‌లో క‌ల అని అర్థం. 640 ట‌న్నుల బ‌రువు క‌లిగిన ఈ విమానం ఒక‌సారి భార‌త్‌లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో మ‌న శంషాబాద్ విమానాశ్ర‌యానికి సైతం వ‌చ్చింది. ఇదిలాఉండ‌గా, రష్యా సైనిక బలగాల చ‌ర్య‌తో ధ్వంస‌మైన త‌మ భారీ విమాన వివ‌రాల‌ను ఉక్రెయిన్ ప్ర‌తినిధులు ధ్రువీక‌రించారు. దీనికి త‌గిన ప్ర‌తికారం చెల్లించుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. గత గరువారం నుంచి రష్యా దాడుల్లో 352 మంది పౌరులు చనిపోయినట్లు  ఉక్రెయిన్‌ ప్రకటించింది. వారిలో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది.

మ‌రోవైపు, ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌తో పాటు ఇత‌ర ఉక్రెయిన్ న‌గ‌రాల్లోనూ భీక‌ర దాడులు జ‌రిగాయి.  తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో నాలుగు సార్లు భారీ పేలుళ్ల శ‌బ్ధాలు కీవ్‌లో వినిపించాయి. దాడుల స‌మ‌యంలో ఆకాశం వెలుతురుతో నిండిపోయింది. కొన్ని చోట్ల ఆ సంఘ‌ట‌న‌లు వీడియోల‌కు చిక్కాయి. అయితే కీవ్‌లో ర‌ష్యా సేన‌లు దేన్ని టార్గెట్ చేశాయో స్ప‌ష్టం కావ‌డం లేదు. ఆ భారీ పేలుళ్లో ఎంత మంది మ‌ర‌ణించారు, ఎంత మంది గాయ‌ప‌డ్డార‌న్న విష‌యం కూడా ఇంకా తెలియ‌దు.

కాగా, ర‌ష్యా ఉక్కు వ్యాపార‌వేత్త‌, బిలియ‌నీర్ అలెక్సీ మోర్డ‌షోవ్‌కు చెందిన నౌక‌ను ఇట‌లీలో సీజ్ చేశారు. ర‌ష్యాపై ఆంక్ష‌ల విధింపులో భాగంగా ర‌ష్యా వ్యాపార‌వేత్త‌కు చెందిన అత్యంత ఖ‌రీదైన నౌక‌ను స్వాధీనం చేసుకున్నారు. తీర ప్రాంత న‌గ‌రం ఇంపీరియా వ‌ద్ద దీన్ని అదుపులోకి తీసుకున్నారు.ర‌ష్యా అధికార భ‌వ‌నంతో లింకులు ఉన్న నేప‌థ్యంలో మోర్డ‌షోవ్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టారు.

సివ‌ర్‌స్టాల్ స్టీల్ కంపెనీలో మోర్డ‌షోవ్ ప్ర‌ధాన షేర్‌హోల్డ‌ర్‌. ఆ కంపెనీ ఆస్తులు బిలియ‌న్ల‌లో ఉన్నాయి. ప్ర‌తి ఏడాది ఆ కంపెనీ సుమారు 2.5 మిలియ‌న్ల ట‌న్నుల ఇనుమును స‌ర‌ఫ‌రా చేస్తుంది. కాగా, లేడీ ఎం యాచ్ ఖ‌రీదు సుమారు 70 మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని ఇట‌లీ అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Watch Here : https://twitter.com/AuroraIntel/status/1499642765155737602?s=20&t=f4QU5m1KDYMM5cT-DZl_VA
Tags:    

Similar News