థర్మోబారిక్ బాంబు ప్రయోగించిందా ?

Update: 2022-03-04 06:31 GMT
ఇపుడిదే విషయం అంతర్జాతీయ స్ధాయిలో పెద్ద చర్చనీయాంశమైపోయింది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత కీలకమైన థర్మోబారిక్ బాంబును (అణుబాంబు కాదు) ప్రయోగించిందని ఐక్య రాజ్యసమితిలోని  ఉక్రెయిన్ రాయబారి మీడియాతో చెప్పారు. అయితే రాయబారి చేసిన ప్రకటనను అమెరికాతో సహా యూరోపు దేశాలు పెద్దగా నమ్మటంలేదు.

ఎందుకంటే నిజంగానే రష్యా గనుక థర్మోబారిక్ బాంబు ప్రయోగించుంటే ఉక్రెయిన్లో పరిస్ధితులు ఇంకా అధ్వాన్నంగా ఉందేవట. పైగా ఒకసారి ప్రయోగిస్తే ఒకబాంబుతో రష్యా ఆగదు. ఎక్కడెక్కడ బాంబులు వేయాలో అక్కడంతా థర్మోబారిక్ బాంబులు వేసేసుండేదే అని అమెరికా మాజీ సైన్యాధికారి సర్ రిచర్డ్ అనుమానం వ్యక్తంచేశారు. రష్యా గనుక థర్మోబాంబర్లను ప్రయోగించుంటే ఈపాటికే ఉక్రెయిన్లో వేలాదిమంది చనిపోయుండేవారట.

సరే అంతర్జాతీయస్ధాయిలో ఇంత చర్చకు దారితీసిన థర్మోబారిక్ బాంబంటే ఏమిటి ? ఏమిటంటే అణ్యాయుధాల తర్వాత అంతటి వినాశనాన్ని సృష్టించగల అత్యంత శక్తవంతమైన బాంబులివి. దీని వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం తప్పదు. దీన్ని ప్రయోగిస్తే ప్రయోగించిన ప్రాంతంలో సుమారు వెయ్యి అడుగుల గొయ్యి ఏర్పడుతుందట. అంటే దీని ప్రభావం ఐదారు కిలోమీటర్ల వరకు భయంకరంగా ఉంటుంది. దీన్ని ప్రయోగిస్తే చుట్టుపక్కల వాతావరణంలోని ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేసుకుంటుంది.

దీనివల్ల మనుషులకు ఆక్సిజన్ అందక క్షణాల్లో చనిపోతారు. అంతేకాదు స్టౌ మీద నీటిని వేడిచేసినపుడు నీరు ఎలా ఆవిరి అయిపోతుందో అలాగే మనుషుల శరీరాలు కూడా ఆవిరైపోతాయట. వీటినే వ్యాక్యూమ్ బాంబ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రయోగించిన ప్రాంతంలో వాతావరణంతో పాటు భూమిలోపల కూడా భయంకరమైన ప్రకంపనలు సృష్టిస్తుంది. దీని కారణంగా చుట్టుపక్కల భవనాలంతా నేలమట్టమమైపోతాయి. సో మనకు నిపుణులు తెలిపిన లక్షణాల ప్రకారమైతే రష్యా ఇప్పటివరకు ఉక్రెయిన్ పై థర్మోబారిక్ బాంబులను ప్రయోగించినట్లు ఆధారాలు లేవు. మరి భవిష్యత్తు సంగతి దేవుడికే తెలియాలి.
Tags:    

Similar News