సింగపూర్ ఓ చిన్నదేశం. అక్కడి జనాభా 56 లక్షలు. సింగపూర్ పేరుకు చిన్నదేశమే అయినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో .. ప్రజల జీవనప్రమాణాలు పెంచడంలో ఆ దేశం ఎప్పుడూ ముందుంటుంది. తమ దేశ ప్రజలకు ఆరోగ్యం, భద్రత తదితర అన్నివిషయాలపట్ల కూడా ఆ దేశం ఎంతో పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. తాజాగా కరోనా కట్టడిలో సింగపూర్ సక్సెస్ అయ్యింది. ఆ దేశంలో ఇప్పటివరకు కేవలం 58,721 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలా తక్కువ సంఖ్యలో కేవలం 29 మంది మాత్రమే మరణించారు. అయితే ఒక యాప్ సాయంతో పటిష్ఠమైన ఆరోగ్యసిబ్బందితో అక్కడ కరోనా కట్టడి చేయగలిగారు.
సింగపూర్ ప్రభుత్వం ట్రేస్ టు గెదర్ అనే యాప్ ద్వారా కరోనా కట్టడిని చేయగలిగిందని అక్కడి అధికారులు అంటున్నారు. ‘ట్రేస్‌టుగెదర్’ అనే యాప్ను దేశంలో ఉన్న ప్రతిపౌరుడు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారికి మన పక్కనే అంటే దాదాపు 2 మీటర్ల దూరంలో ఎవరైనా కరోనా పేషెంట్ ఉంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరోవైపు ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారికి కనక కరోనా వస్తే వాళ్లను వెంటనే క్వారంటైన్ చేస్తారు. అనంతరం వారికి తగిన చికిత్స అందిస్తారు. మరోవైపు సింగపూర్ నగరంలో ఎక్కడికి వెళ్లాలన్న ఈ యాప్ ద్వారా కోడ్ను స్కాన్ చేశాకే అనుమతి లభిస్తుంది.
విమాన ప్రయాణికులకు సింగపూర్ ఇమ్మిగ్రేషన్ డిజిటల్ కోవిడ్ 19 సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. తద్వారా సింగపూర్ నుంచి రాకపోకలు సాగించేవారిలో కరోనా పేషెంట్లను గుర్తిస్తోంది. కరోనా నిబంధనలు, మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడంపై కూడా అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది.
ఎవరైనా మాస్క్ ధరించకపోతే 225 డాలర్లు ఫైన్ విధిస్తున్నారు. ఇటువంటి చర్యలతో కరోనా సింగపూర్లో అదుపులోకి వచ్చింది.