ఒకటి.. రెండు వేవ్ లు రావటం.. దేశ ప్రజల్ని అతలాకుతలం చేసిన కరోనా మాయదారి ఏమేం చేసిందో అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత.. దాని షాక్ నుంచి తేరుకోవటానికి ఎక్కువ సమయమే పట్టింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. ఇలాంటి వేళలోనే రష్యా.. బ్రిటన్ లలో పెద్ద ఎత్తున కేసులు నమోదువుతున్న వైనం ఇప్పుడు ప్రమాదకర సంకేతాల్ని పంపుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు ప్రమాదకర వైరస్ చైనా లో షురూ కావటం.. మూడో వేవ్ భారత్ ను త్వరలోనే హిట్ చేస్తుందా? అన్న ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.
భీకరంగా విరుచుకుపడిన సెకండ్ వేవ్ తర్వాత మూడో వేవ్ కు సంబంధించిన అపోహలు.. అపనమ్మకాల భయంతో కొంతకాలం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిన ప్రజలు.. కేసుల సంఖ్య తగ్గి పోవటంతో కొవిడ్ లేదన్న భావనకు వచ్చేశారు. రోడ్ల మీద చూస్తే ముఖానికి మాస్కు పెట్టుకొని తిరుగుతున్న వారి సంఖ్య తగ్గింది. కొందరు ముఖానికి మాస్కు పెట్టుకున్నా.. అలంకరణ అన్నట్లుగానే ఉంది తప్పించి.. జాగ్రత్తలు తగ్గిపోయాయి.
దీనికి తోడు గడిచిన కొంతకాలం గా తమను తాము నియంత్రించుకున్న నేపథ్యం లో ప్రయాణాల కు దూరంగా ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు జర్నీలు పెట్టుకుంటున్నారు. మాస్కులు ధరించకపోవటం.. సోషల్ డిస్టెన్స్ అన్నది పాటించకపోవటంతో పాటు.. గతంలో తీసుకున్న జాగ్రత్తల తో పోలిస్తే.. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు మూడో వేవ్ ముప్పు ను తీసుకురావటం ఖాయమన్నట్లు గా అంచనాలు సాగుతున్నాయి.
కొవిడ్ తొలిదశ మార్చి లో మొదలైనా.. తీవ్రత మాత్రం మే నుంచి సెప్టెంబరు వరకు ఉండటం తెలిసిందే. సెకండ్ వేవ్ విషయానికి వస్తే ఈ ఏడాది మేలో మొదలై.. జూన్ వరకు తీవ్రంగా సాగింది. దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని దారుణ పరిస్థితులు నెల కొనటమే కాదు.. వైద్యం అందక ఎంతోమంది కళ్ల ముందు చనిపోయిన వీడియోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేశాయి. దీనికి తోడు వచ్చి పడ్డ ఎన్నికలు.. పాలక పక్షంతో పాటు.. అధికారులు సైతం పెద్దగా పట్టనట్లు వ్యవహరించటంతో అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించటం తెలిసిందే.
అనంతరం కేసుల నమోదు తగ్గటంతో ఊపిరి పీల్చుకుంటున్న వారికి ఇప్పుడు బ్రిటన్.. రష్యా.. చైనాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యం లో అ ప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. కొత్త వేరియంట్ విరుచుకుపడటం.. అనంతరం అది కాస్తా మ్యుటెంట్ అయితే దాని తీవ్రత మరింత పెరుగుతుందన్నది మర్చిపోకూడదు. ఏ తావాతా మూడో వేవ్ విరుచుకుపడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.