రాక్షసుల కన్ను మోడీ.. పారికర్ ల మీద పడింది

Update: 2016-01-19 13:53 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ తీవ్రవాదుల కన్ను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ.. రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ ల మీద పడింది. ఇస్లామిక్ స్టేట్ సంస్థ పేరు మీద గోవా సెక్రటేరియట్ కు వచ్చిన తాజా లేఖలో భారత ప్రధాని.. రక్షణ మంత్రిని చంపేస్తామంటూ హెచ్చరించారు.

దీంతో అప్రమత్తమైన గోవా నిఘా విభాగం.. పోలీసు బలగాలను.. జాతీయ భద్రతా దళాల్ని అప్రమత్తం చేశారు. తమకు వచ్చిన పోస్ట్ కార్డు కాపీని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్  అన్ని పోలీస్ స్టేషన్లకు పంపింది. అయితే.. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు రాశారన్న కోణంలో భద్రతా దళాలు విచారిస్తున్నాయి.
Tags:    

Similar News