విచిత్రంగా ఉన్నా నిజమని చెబుతోంది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థ ఎల్ జీ. తాము తయారు చేసిన టీవీ దోమల్ని తరిమేస్తుందన్న మాట ఇప్పుడు పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. దోమల్ని దగ్గరకు రానివ్వకుండా చూసే ప్రత్యేకమైన టీవీని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసినట్లుగా చెబుతోంది ఎల్ జీ. మస్కిటో ఎవే టీవీ పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ టీవీని ఆన్ చేస్తే.. టీవీ చెంతకు దోమలు రానే రావట.
భారతీయ వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని తాజా టీవీని తయారు చేసినట్లుగా ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ఈ టీవీల రేంజ్ రూ.30 వేలకు కాస్త తక్కువగా.. రూ.47వేలకు కాస్త ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. టీవీలో ఏర్పాటు చేసిన అల్ట్రాసోనిక్ పరికరాన్ని ఒకసారి యాక్టివేట్చేస్తే.. సౌండ్ వేవ్ టెక్నాలజీ పని చేస్తుందని.. దీంతో.. దోమలు చెంతకురాకుండా పారిపోతాయని చెబుతున్నారు.
దోమల్ని తరిమేసే ఈ టీవీ కారణంగా ఎలాంటి హానికార రేడియేషన్లను విడుదల చేయదని దీని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ఈ టీవీ చెంతకు దోమలు అస్సలు రానే రావని చెబుతున్నారు. దోమల సంగతేమో కానీ.. వినేందుకు మాత్రం కాస్త విచిత్రంగా ఉంది కదూ ఈ దోమల టీవీ యవ్వారం.