వైఫై మాట పాతది.. ఇక అంతా లైఫైనేనంట

Update: 2015-11-26 04:03 GMT
బ్లూటూత్.. వైఫై లాంటి మాటలు సపరిచితమే. కానీ.. లైఫై మాటను విన్నారా? వైఫైకి లేటెస్ట్ వెర్షన్ ఈ లైఫై.. డేటా ట్రాన్సఫర్ కు సరికొత్త విధానం ఈ లైఫై ద్వారా చేయనున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ లైఫైతో మరింత వేగంగా డేటాను పంపిణీ చేసే అవకాశం అందుబాటులోకి రానుంది. ఇంతకీ లైఫై అంటే ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. డేటాను మరింత వేగంగా పంపిణీ చేయటానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న బ్లూటూత్.. వైఫై మాదిరే లైఫై పని చేస్తుంది. కాకుంటే.. లైఫై ద్వారా డేటాను ఎల్ ఈడీ బల్బుల సాయంతో పంపిణీ చేస్తారు.

ఈ సరికొత్త సాంకేతికత 2011లో అందుబాటులోకి వచ్చినా కొన్ని సాంకేతిక కారణాలతో పద్దగా వినియోగంలోకి రాలేదు. కానీ.. తాజాగా ఈ లైఫైను అందరికి అందుబాటులో తీసుకురానున్నారు. అయితే.. వైఫై మాదిరి లైఫైను అందరూ వినియోగించే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే.. ఈ లైఫైకు గోడలు దాటి వెళ్లే అవకాశం లేదు. అంటే.. ఒక పెద్ద రూమ్ లో వాయు వేగంతో డేటా టాన్సఫర్ చేసే ఈ టెక్నాలజీలో.. మరో గదిలోకి సిగ్నల్ ఉండదు. ఇదే లైఫైలో అతి పెద్ద ఇబ్బంది.

అయితే.. లైఫై ద్వారా 224 జీబీపీఎస్ సామర్థ్యంతో డేటాను పంపిణీ చేసే అవకాశం ఉంది. లైఫైలో ఉన్న ప్రతికూలతను సానుకూలంగా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు. పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల్లో పరిమిత మోతాదులో వాయువేగంతో డేటాను టాన్సఫర్ చేసే లైఫైకు రాబోయే రోజుల్లో మాంచి ఆదరణ లభించే వీలుందంటున్నారు. సో.. రానున్న రోజుల్లో ‘‘లైఫై’’ అనే మాటను మీరు తరచూ వాడనున్నారన్న మాట.
Tags:    

Similar News