ఏపీలో మందు బందేనా?

Update: 2019-10-25 09:13 GMT
ఏపీలో మద్యం తాగేవారికి ఢోకా లేదు.. ఉదయం లేవగానే క్వార్టర్ వేయనిదే పని మొదలు పెట్టని వారు ఎంతో మంది ఉన్నారు. అయితే  ఇక మరో వారంలో షాపులన్నీ ఖాళీ అయిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఇంతకీ ఏపీలో ఇక మందు వారం తర్వాత బందేనా అన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా?  మద్యం ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులు (డిస్టిలరీలు)కు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడమే..

ప్రభుత్వం డిస్టిలరీల వద్ద మద్యం తీసుకొని వైన్ షాపుల ద్వారా అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. కానీ డిస్టిలరీలకు మాత్రం చెల్లంచడం లేదట.. దీంతో 1700 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలు ఇవ్వకుంటే ఉత్పత్తి తమ వల్లకాదని.. పెట్టుబడి పెట్టలేమని ప్రభుత్వానికి తేల్చేశాయి. ఇక  ఇప్పటికే కొన్ని కంపెనీలు పూర్తిగా సరఫరాను నిలిపివేశాయి. డిమాండ్ ఉన్న లిక్కర్ ఉత్పత్తి సంస్తలు కూడా ఏపీలో మద్యం  సరఫరాను నిలిపివేశాయి.

దీంతో మద్యం షాపుల్లో మద్యం కొరత ఏర్పడింది. మద్యం పంపాలని ఎక్సైజ్ అధికారులు కోరుతున్నా డిస్టిలరీలు బకాయిలు ఇచ్చేదాకా పంపమని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేక, మద్యం కొరతను తీర్చలేక ఎక్సైజ్ అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. కేవలం మరో వారం వరకు మాత్రమే మద్యం నిల్వలున్నాయి. ఆ తర్వాత మద్యం షాపులన్నీ ఖాళీ అయిపోతాయి. దీంతో ఏపీలో మద్యం దొరక్క మందుబాబులు ఎన్ని అవస్థలు పడుతారో చూడాలి.  

ఏపీలో డిమాండ్ ఉన్న లిక్కర్ బ్రాండ్లు ఇప్పటికే దొరకడం లేదు. అవన్నీ ఉత్పత్తి ఆపేశాయి. ఇక మొత్తం 15 డిస్టిలరీల్లో 6 ఈ నెలలో ఉత్పత్తిని ఆపేశాయి. దీంతో వినియోగదారులకు కొత్త మద్యం బ్రాండ్ లను షాపు నిర్వాహకులు అంటగడుతున్నారు. కానీ వారు దాన్ని తీసుకోకపోవడంతో ఇప్పటికే మద్యం కొరత ఏపీలో తీవ్రమైంది.
Tags:    

Similar News