ఒక దేశ ప్రధాని వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరు కాదంటారు? ఎగబడిపోతారు! అదే ప్రధాని కాస్త ఒంగి మరీ షేక్ హ్యాండ్ ఇస్తే, హాయ్ చెబితే... ఇంక ఆ ఆనందానికి హద్దేముంది. అయితే అలా షేక్ హ్యాండ్ ఇచ్చినా.. సరేలే హైట్ ప్రాబ్లం ఏమో అని ప్రధాని అంతటివాడే మోకాళ్లపై ఉండి మరీ చేయి అందించినా.. చిరాగ్గా ముఖం పెట్టాడే కాని - కనీసం మాటవరసకి - మర్యాదకి అయినా చేయి అందించలేదు ఒక బుడ్డోడు! అయితే... ఆ బుడ్డోడు సాదా సీదా బుడ్డోడు కాదులెండి.. బుజ్జి యువరాజు!!
విషయానికొస్తే... బ్రిటన్ రాజవంశపు బుజ్జి యువరాజు జార్జ్ - కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు షాక్ ఇచ్చాడు. ఒక వారంపాటు విహరించడానికి కెనడాకు వెళ్లిన బ్రిటన్ రాజకుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించడానికి బ్రిటిష్ కొలంబియా విమానాశ్రయానికి వచ్చారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో. ఆయనతోపాటు పలువురు కెబినెట్ మంత్రులు కూడా విమానాశ్రయానికి వచ్చారు. ఈ పర్యటనలో ప్రిన్స్ విలియమ్ - కేట్ దంపతుల పిల్లలు ప్రిన్సెస్ చార్లెట్ - ప్రిన్స్ జార్జ్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా బుజ్జి జార్జ్ ను ఆకట్టుకోవడానికి, అతడితో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ప్రధాని ట్రుడో ప్రయత్నించారు - ఆ బుజ్జాయిను మురిపించడానికి మోకాళ్లపై కూచోని మరీ షేక్ హ్యాండ్ ఇవ్వమన్నారు కానీ.. ఆ ప్రధాని చేష్టలు జార్జ్ కు నచ్చలేదో ఏమో కానీ.. ప్రధాని షేక్ హ్యాండ్ ను తిరస్కరించాడు.
ఇక ఎంత ప్రయత్నించినా లాభం లేదని భావించిన ప్రధాని పైకిలేచి ఈ బుడ్డోడి ఎదురుదెబ్బను దిగమింగుకున్నారు. తనకు షేక్ హ్యాండ్ ఇస్తున్న వ్యక్తి ఒక దేశ ప్రధాని అనీ, ఒక దేశ పర్యటనకు వచ్చినప్పుడు దౌత్యపరమైన మర్యాదలు పాటించాలని ఆ బుడ్డోడికి తెలిసి ఉండదేమో! అందుకే తనకు నచ్చని ట్రుడోకు షాకిచ్చాడు.