పెరిగిపోతున్న విద్వేషం... తామే స్థానికులం అన్న అహంకారంతో ఇతర దేశస్థులపై తూటాలు కురిపిస్తున్న అమెరికన్లు నిజంగా అక్కడి స్థానికులా? అంటే కాదనే చెప్పాలి. అమెరికా అన్నది ఇప్పుడుఎప్పుడూ కూడా వలస వచ్చినవారి దేశమే. అక్కడున్న తెల్లోళ్లు అమెరికన్లు కాదు. యూరప్ దేశాల నుంచి వలస వచ్చినవారు మాత్రమే. ‘అమెరికాయే ముందు’ అనీ ‘అమెరికన్లే ముందు’ అంటూ ట్రంప్ పెద్దపెద్ద మాటలు చెబుతుంటే అక్కడి ప్రజల్లో దేశ భక్తి కాస్తా ద్వేషభక్తిగా మారిపోతోంది. అమెరికా అంటే వలసల రాజ్యం.. ఎవరు ముందూ, ఎవరూ వెనుక అన్నదొక్కటే తేడా తప్ప అందరూ విదేశీయులే. కానీ యూరప్ మూలాలున్న శ్వేత జాతీయులదే అమెరికా అన్న ‘జాత్యహంకారం’ పెరుగుతూ వచ్చింది. అబ్రహాం లింకన్ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఈ అహంకారానికి చెక్ పెడుతూ వచ్చినా.. చివరకు నల్ల జాతీయుడైన ఒబామా రెండు సార్లు అధ్యక్షుడైనా కూడా ఇప్పటికీ జాత్యాహంకారం మాత్రం పోలేదు.
ఇతర దేశీయులొచ్చి అమెరికన్ల ఉద్యోగవకాశాలను కొల్లగొడుతున్నారన్న నెపంతో దురహంకారులు దాడులు చేస్తున్నారు. ఇండియన్ల పట్ల ద్వేషభావాన్ని పెంచుకున్నారు. అంటే బ్లాక్స్ చేసే ఉద్యోగాలనే భారతీయులు అపహరిస్తున్నారనే ప్రచారం తొలి దశలో జరిగింది. కానీ, అమెరికన్ శ్వేతజాతీయులకు ఈ అసహనం బదలీ అయ్యింది. అంతవరకూ ఐటీ - ఇతరరంగాలలో దిగువ, మధ్య స్థాయి ఉద్యోగాలనే అందుకున్న భారతీయులు ఆ తరువాత కాలంలో సత్య నాదెళ్ళ - సుందర్ పిచాయ్ వంటివారు ఏకంగా ఐటీ జెయింట్లకు సీఈవోలుగా ఎదగడంతో మరింతగా ఫోకస్ అయిపోయారు. ఈ ద్వేషాన్నే ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ అభ్యర్థిగా దిగిన ట్రంప్ తన ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. శ్వేత జాతీయుల్లో జాత్యహంకారులకు విద్వేషం పెరిగిపోయింది.
ట్రంప్ రెండు రకాల అభద్రతలను తన అమ్మకపు సరకుగా వాడుకున్నారు. ఒకటి.. అమెరికన్ల ఉద్యోగ భద్రత; రెండు.. అమెరికన్ల ప్రాణ భద్రత. ఉద్యోగ భద్రత విషయంలో ఇటు ఇండియన్లనూ, అటు మెక్సికన్లనూ లక్ష్యంగా చేశారు. వీరే లేకుంటే అమెరికన్లకు ఉపాధి - వ్యాపారవకాశాలు మరింతగా దక్కేవన్న అపోహను బాగా పెంచారు. కానీ వీరే లేకపోతే, అమెరికాలో ఐటీతో పాటు పలు పరిశ్రమలు కుప్ప కూలిపోతాయన్న వాస్తవాన్ని మరుగుపరిచారు. అలాగే, ఇస్లామిక్ టెర్రరిజాన్ని బూచిగా చూపించారు. టెర్రరిస్టుల మీద వుండే ద్వేషాన్ని, ప్రపంచంలోని ముస్లిం సోదరుల మీదా, ముస్లిం దేశాల మీదా పెంచారు. ప్రచారంలో ఈ మాటలు ట్రంప్ చెబుతూంటే, వోట్లకోసం ఉద్వేగాలను పెంచుకుంటున్నాడు కానీ, అధ్యక్షుడయ్యాక ఇవన్నీ చేస్తారా- అని సరిపెట్టుకున్నారు. కానీ, ట్రంప్ ఏది చెప్పారో, అదే చేసేశారు. అది కూడా ఆఘ మేఘాల మీద. ముందు ప్రాణ భద్రతను తడిమారు. ఏడు ముస్లిం దేశాలనుంచి పౌరులను కట్టడి చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేశారు. వెనువెంటనే, ఉద్యోగ భద్రత కార్డు తీశారు. హచ్ వన్ బీ వీసాల మీద వేటు వేశారు. ఇది నేరుగా భారతీయులకే తగిలింది. అలాగే కొన్ని రోజుల క్రితమే చట్టవిరుద్ధ ఇమ్మిగ్రేషన్ కింద మూడు లక్షల భారతీయులను వెనక్కి పంపటానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పుడిక అమెరికా లో జాత్యహంకారుల ద్వేషం వెర్రితల లు వెయ్యటం మొదలయ్యింది. భారతీయ ఉద్యోగులు ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన స్థితి అమెరికాలో పలుచోట్ల ఏర్పడింది. ‘ మా దేశాన్ని వదలి పొండి’ అంటూ స్పష్టంగా చెప్పి మరీ కాల్చాడు దుండగుడు. పక్కనున్న మరో తెలుగు యువకుడి మీదా కాల్పులు జరిపాడు కానీ, అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాను ప్రజాస్వామ్యానికీ, బహుళ సంస్కృతులకు పుట్టినిల్లుగా భావించేవారు. కానీ, ఆపునాదులు ఇప్పుడు కదలి పోతున్నాయి. అయితే ఈ ‘ద్వేష భావం' అమెరికన్లందరిలోనూ ఉందనుకోవటం పొరపాటు. దుండగుడు(పురిన్ టన్) నుంచి శ్రీనివాస్ ను కాపాడటానికి విఫల యత్నం చేసిన గ్రిల్లట్ కూడా అమెరికనే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/