ఏపీలోని ఆ మూడు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్

Update: 2020-06-20 07:50 GMT
రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటతో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వైరస్ చైయిన్ తెంపేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. వైరస్ కట్టడిలో భాగంగా మూడు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించనున్నారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేయనున్నారు.

జూన్ 21 వతేదీ నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఆ జిల్లాలే  ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురము. ఈ జిల్లాలో అవసరమైతే నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో  పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో  మళ్లీ  లాక్డౌన్  ప్రకటించారు. ఆదివారం ఉదయం నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

- ప్రకాశం జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఒంగోలు, చీరాలలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్  తెలిపారు.
- శ్రీకాకుళం జిల్లా పలాసలో  ఇటీవల ఒక ఇంటిలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక బంధువుకి  పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ వచ్చింది. మరొకరికి కూడా పాజిటివ్ తేలింది. దీంతో పలాస కాశీబుగ్గలనుకంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి... నియోజకవర్గం మొత్తం లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు  కలెక్టర్ ప్రకటించారు.

- అనంతపురంతో సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లుల్లో లాక్ డౌన్ విధిస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.  అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఎవరూ రోడ్డు మీదకు రాకూడదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయి. మాంసం దుకాణాలు ఆదివారం పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఇక వారం రోజుల తర్వాత పరిస్థితిని బట్టి లాక్‌డౌన్ కొనసాగింపు పై నిర్ణయం తీసుకుంటారు.

ఈ విధంగా ఆయా జిల్లాలో అధికారులు కేసుల తీవ్రతను బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎటు తిరిగి వైరస్ అదుపులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. ప్రజలు సహకరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరుతున్నారు.
Tags:    

Similar News