దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఫుణే మెట్రో పాలిటిన్ నగరాల్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో ఈ రెండు నగరాల్లో లాక్ డౌన్ ను మే 3 తర్వాత కూడా పొడిగించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం. కేసుల సంఖ్య ఇలానే పెరుగుతూ పోతే మే 3 తర్వాత కూడా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగించాలని అక్కడి ప్రభుత్వం డిసైడ్ అయ్యిందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం ముంబై, ఫుణేల్లో రోజురోజుకు పెరుగుతున్న కేసులతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే జూన్ వరకు లాక్ డౌన్ పొడిగించవచ్చని మహారాష్ట్ర సీనియర్ అధికారులు తెలిపారు.
భారతదేశంలోనే కరోనా తీవ్రత మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం శనివారం మహారాష్ట్రలో కొత్తగా 387 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,817 కు చేరింది. వ్యాధి సోకిన వారిలో 840 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 301 మంది మరణించారు. ఒక్క పూణేలోనే 68 మంది మరణించారు. ఇప్పటివరకు 4,447 కేసులు నమోదైన ముంబైలో 178 మంది మరణించారు.
ముంబై - పూణేలలో లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా పరిణమించనుంది. భారతదేశంలోనే చాలా ఎక్కువ సంఖ్యలో పెద్ద కార్పొరేట్ కంపెనీలు ముంబైలో ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజీ కూడా ఇక్కడే ఉంది. ఆర్థిక రాజధానిలో నడుస్తున్న వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగం ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఈ సమయంలో, ముంబైతోపాటు మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ముంబై, మహారాష్ట్ర ఎంత ఎక్కువ కాలం లాక్ డౌన్ లో ఉంటే భారత దేశానికి అంత ఎక్కువ నష్టమని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. మరి కరోనా తగ్గేదెప్పుడు? ముంబై సాధారణ స్థితికి వచ్చేదెప్పుడన్న టెన్షన్ వ్యాపార వర్గాల్లో ఆందోళనకు దారితీస్తోంది.