కుటుంబ ఆస్తులను ప్రకటించిన నారా లోకేశ్ !

Update: 2020-02-20 11:30 GMT
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు , ఎమ్మెల్సీ నారా లోకేశ్ తన ఆస్తులను ప్రకటిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆయన తమ కుటుంబ ఆస్తుల వివరాలని ప్రకటించారు. గత తొమ్మిదేళ్లుగా మేము ఆస్తులని స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నామని, దేశంలో కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించిన ఏకైక కుటుంబం తమదే అని లోకేష్ తెలిపారు. తన తండ్రి ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని, మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తుల్లోనూ మార్పులేదని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు తన, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలను విడుదల చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి నాడు తెరదీశారు. తమపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేసే ముందు వాళ్ల ఆస్తులని ఒకసారైనా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. అలాగే , తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆస్తులను సంపాదించడం మాకు తెలీదన్నారు. కుటుంబానికి ఆర్థిక స్వాతంత్య్రం కోసం 25 ఏళ్ల క్రితం హెరిటేజ్‌ను స్థాపించామన్నారు. హెరిటేజ్ ద్వారా గత ఏడాది రూ.83 కోట్ల ఆదాయం లభించిందన్నారు. హెరిటేజ్ ద్వారా నేరుగా 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది అని తెలిపారు.

లోకేష్ ప్రకటించిన కుటుంబ ఆస్తుల వివరాలు:

చంద్రబాబు ఆస్తులు :

మొత్తం ఆస్తులు రూ.9కోట్లు
మొత్తం అప్పులు రూ.5.13 కోట్లు
నికర ఆస్తులు రూ.3.87కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.87లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో)
బ్యాంక్ లోన్ రూ.18లక్షలు తగ్గింది

భువనేశ్వరి ఆస్తులు
మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు
మొత్తం అప్పులు రూ.11.04 కోట్లు
నికర ఆస్తులు రూ.39.58 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.8.50కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)

నారా లోకేష్ ఆస్తులు :

మొత్తం ఆస్తులు రూ.24.70 కోట్లు
మొత్తం అప్పులు రూ.5.70 కోట్లు
నికర ఆస్తులు రూ.19 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.2.40 కోట్లు తగ్గుదల (నికర ఆస్తిలో)

నారా బ్రాహ్మణి ఆస్తులు

మొత్తం ఆస్తులు రూ.15.68 కోట్లు
మొత్తం అప్పులు రూ.4.17 కోట్లు
నికర ఆస్తులు రూ.11.51 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ. 3.80 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)

నారా దేవాన్ష్ ఆస్తులు :

మొత్తం ఆస్తులు రూ.19.42 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే రూ.71లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో)
నారా దేవాన్ష్‌కు చంద్రబాబు హెరిటేజ్‌‌ లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్ ఇచ్చారు.

నిర్వాణ హోల్డింగ్స్ ..మొత్తం అప్పులు రూ.37.20 కోట్లు అప్పులు ఉండేవి. రూ.34.85 కోట్లకు తగ్గగా, ప్రస్తుత నికర ఆస్తులు రూ.9.10 కోట్లు. గత ఏడాదిలో రూ.2.27 కోట్లు పెరుగుదల


Tags:    

Similar News