నవతరం సహజీవనం 'ప్రేమ'..

Update: 2019-06-12 04:32 GMT
టిప్పు టాపు గా తయారు కావడం.. సూటు - బూటు  వేసుకోవడం.. అమ్మాయి ఇంటికి వెళ్లడం.. పెళ్లి చూపులు చూడడం.. తొలి చూపులోనే నచ్చడం.. పెళ్లి - పిల్లలు.. సంసార సాగరం.. ఇది ఓ  కొన్నేళ్ల  కిందటి మాట..

ఇక మొన్నటివరకు ప్రేమ పెళ్లిళ్లు.. తొలి వలపు విసరడం.. అమ్మాయి.. అబ్బాయిలు నచ్చడం.. ప్రేమ.. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకోవడం.. సినిమాల ప్రభావంతో ఈ ప్రేమ పెళ్లిళ్లు కాస్తా ఎక్కువయ్యాయి..

ఇక ఇప్పుడు అంతా సహజీవనం.. అంతా కుదిరితేనే పెళ్లి.. లేదంటే నీ దారి నీదే.. నా దారి నాదే.. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ - హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసే యువతీ యువకుల్లో ఈ తరహా సంస్కృతి ప్రస్తుతం పెరిగిపోయింది.. విలక్షణమైన మెచ్చురిటీ ప్రేమలు కనిపిస్తున్నాయి. సహజీవనం - ఘాటు ప్రేమ.. బాథ్యతల కోసం వదిలేయడానికి కూడా నేటి తరం వెనుకాడకపోవడం విశేషం.

హైదరాబాద్ కు చెందిన ఓ ఇంజనీరింగ్ కుర్రాడు..తన  క్లాస్ మెట్ అమ్మాయితో కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడ్డాడు. ఆమెతోనే రూమ్ తీసుకొని అప్పుడే సహజీవనం మొదలుపెట్టాడు. ఇద్దరు ఉద్యోగాలు వచ్చాక పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. కుర్రాడు అమ్మ చావుబతుకుల్లో ఉండడం.. ఇతడి చదువులకు ఇబ్బంది రావడంతో మేనమామ డబ్బు సాయం చేశాడు. తన కూతురిని పెళ్లి చేసుకోమన్నాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుర్రాడికి తప్పలేదు. దీంతో ఉద్యోగంలో చేరగానే అతడు తన మరదలునే పెళ్లి చేసుకున్నాడు. అప్పటిదాకా తన ప్రియురాలితో విషయం చెప్పగా.. ఆమె కూడా అతడిని అర్థం చేసుకుంది.  వారిద్దరూ పెళ్లి చేసుకునే వరకూ కూడా సహజీవనం కొనసాగించారు. ఇప్పుడు వేరువేరుగా ఉంటున్నారు..

ఇలా ఈ ఒక్కరి కథే కాదు.. ప్రస్తుతం ప్రేమ లోతుల్ని చూడడం లేదు..సమస్యలనే చూస్తోంది.. అర్థం చేసుకుంటోంది. మునపటిలా ప్రేమకు పెళ్లియే ముగింపుకావడం లేదు.. ప్రేమించిన వాళ్లు పరిస్థితులను బట్టి స్నేహితులుగా మారిపోతున్నారు. ఈ నవతరం సహజీవనం కథ ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది.
Tags:    

Similar News