కరోనా వైరస్ .. ఇప్పుడు అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ, కరోనా కారణంగా ఒకరి ప్రేమ కథ సుకాంతం అయ్యింది. అసలు కరోనా కి ..ప్రేమకి సంబంధం ఏమిటి ..కరోనా తో ఒకవైపు చస్తుంటే ...కరోనా వల్ల ప్రేమ కథ ఎలా సుకాంతం అయ్యింది అని ఆలోచిస్తున్నారా ? కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తెచ్చిన ఇబ్బందులు కొన్ని, పెద్దలకు ఇష్టం లేకపోవడంతో మరికొన్ని ఇబ్బందులు .. వాటి అన్నింటిని వాళ్లిద్దరి నిజమైన ప్రేమ అధిగమించింది.
ప్రేమ చాలా గొప్పది. ప్రేమను సొంతం చేసుకోవాలంటే చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. అంత సులభంగా ప్రేమ దక్కదు. ఒక్క ప్రేమ అనే కాదు... మనం ఇష్టపడ్డవి సాధించుకోవాలంటే కొన్ని వదులు కోవాల్సి ఉంటుంది. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోడానికి 40 కిలోమీటర్ల పాటు ఒంటరిగా నడిచి...ప్రేమికుడి వద్దకు చేరుకుని, తాళి కట్టించుకొని ఒక్కటైయ్యారు. ఈ విషయం పై పూర్తి వివరాలు చూస్తే .. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన కళ్ళేపల్లి సాయి పున్నయ్య, హనుమాన్ జంక్షన్ కు చెందిన సీహెచ్ భవానీ పరస్పరం కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఒక రోజు పెళ్లి బంధంతో ప్రేమ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకున్నారు. ఆలోపు యువతి తల్లిదండ్రులకు వీరి ప్రేమ విషయం అందరికి తెలిసింది. ప్రేమ దోమ లాంటివి కుదరదు అని చెప్పారు. అలాగే ప్రేమికుడైన పున్నయ్యకు యువతి తల్లిదండ్రులు ఫోన్ చేసి, మరోసారి తమ కూతురి వైపు కళ్లెత్తి చూస్తే నువ్వు ఉండవు అని హెచ్చరించారు. దీనితో వారిద్దరూ ఫోన్ లో మాట్లాడుకొని, పెద్దలని ఎదిరించి అయినా కూడా పెళ్లి చేసుకుని ఎలాగైనా ఒకటి కావాలని నిశ్చయించుకున్నారు.
అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో రవాణా సౌకర్యం లేకపోవడంతో వీరి ప్రేమకి కొత్త సమస్య వచ్చి పడింది. అయితే, పెళ్లి చేసుకోవాలనే సంకల్పం ముందు లాక్ డౌన్ పెద్ద సమస్య కాలేదు. హనుమాన్ జంక్షన్ నుంచి ఒంటరిగా బయల్దేరిన భవానీ 40 కి.మీ కాలినడకన మచిలీపట్నం చేరుకుంది. ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రేమికుల వినతి మేరకు పోలీసులు జోక్యం చేసుకొని ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. దీంతో ఇరువైపు కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించడంతో ప్రేమ కథ సుఖాంతమైంది.