కరోనా వైరస్ దారుణంగా మారుతోంది. టెస్టుల్లోనూ పాజిటివ్ గా రావడం లేదు. ర్యాపిడ్ యాంటిజెన్ లాంటి పరీక్షల్లో కూడా చిక్కడం లేదు. మొత్తం నెగెటివ్ రిపోర్ట్స్ రావడంతో ఇంట్లోనే ఉంటున్న వారికి పరిస్థితులు విషమించి ప్రాణాల మీదకు వస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా లక్షణాలుంటే మొదట అరగంటలో ఫలితం వచ్చే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేస్తారు. ఒకవేళ లక్షణాలున్న పాజిటివ్ రాకపోతే ‘ఆర్టీపీసీఆర్’ టెస్ట్ ను నిర్వహిస్తారు. ఈ మేరకు ఐసీఎంఆర్ ఈ రెండు టెస్టులు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.
కానీ తాజాగా కరోనా వైరస్ ఆర్టీపీసీఆర్ టెస్టులకు సైతం అంతుచిక్కడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఓ 40ఏళ్ల వ్యక్తికి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా నెగెటివ్ వచ్చింది. మందులు ఇచ్చి ఇంటివద్దే చికిత్సనందించారు. అయితే 10 రోజుల తర్వాత దగ్గు, జ్వరంతోపాటు ఆయాసం కూడా మొదలైంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయాయి. పరీక్షల్లో నెగెటివ్ రావడంతో అనుమానించిన వైద్యులు అతడి చాతిని సిటీ స్కాన్ తీశారు. దీంతో అందులో కరోనా బయటపడింది. దీంతో విషమించిన ఆ రోగికి కరోనా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
ఇలా కరోనా వైరస్ టెస్టులకు చిక్కకుండా ఉంటోంది. సరిగా పరీక్షలు చేయకపోవడం.. వైరల్ లోడ్ తక్కువగా ఉండడం.. వైరస్ వచ్చి చాలా రోజులు అయితే అది పరీక్షల్లో రావడం లేదని గుర్తించారు. కానీ పరిస్థితిని మాత్రం విషమించేలా చేస్తోంది. ప్రాణాలు పోయే వరకు వస్తోంది.
దీంతో టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా కూడా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండడం.. దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం, నీరసంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.