అళగిరి రీఎంట్రీ..సంధి చేసుకుంటున్న స్టాలిన్

Update: 2018-08-12 06:05 GMT
కరుణానిధి మరణం తరువాత డీఎంకే పార్టీ పరిస్థితేమిటన్న ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. ఆయన కుమారులు స్టాలిన్ - అళగిరి ఇద్దరూ యాక్టివ్ పొలిటీషియన్లే కావడంతో ఆధిపత్య పోరు తప్పదని భావిస్తున్నారు. పైగా కరుణానిధి ఉన్నప్పుడే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించడం - స్టాలిన్‌ కు ప్రాధాన్యమిచ్చిన నేపథ్యంలో అళగిరి పార్టీని చీల్చుతారన్న వాదనా ఒకటి తమిళనాట వినిపిస్తోంది.
   
అయితే.. ఇలాంటి ప్రమాదాన్ని శంకించిన స్టాలిన్.. అళగిరితో సంధి చేసుకోవడానికి అన్ని మార్గాదలూ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అళగిరిని తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఆయనకు ఇతర తోబుట్టువుల నుంచి సహకారం అందుతోందట.
   
కాగా తనను మళ్లీ పార్టీలోకి తీసుకున్నప్పుడు ప్రాధాన్యత కల్పించడంతో పాటు కీలకమైన పదవి ఇవ్వాలని అళగిరి కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో అళగిరి డీఎంకే దక్షిణ మండల ప్రిసీడియం కార్యదర్శిగాను - కేంద్ర మంత్రిగాను పనిచేశారు. తండ్రి మరణానంతరం కుటుంబంలో - పార్టీలో ఎలాంటి లుకలుకలు రాకుండా అళగిరి - స్టాలిన్‌ కలసిమెలసి సాగాలని వారి సోదరి సెల్వి రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. వచ్చే మంగళవారం జరుగనున్న పార్టీ సమావేశంలో అళగిరి విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Tags:    

Similar News