మ్యాడ్ కౌ డిసీజ్... ఈ పేరు వింటేనే ఒకప్పుడు యూరప్ వాసుల్లో వణుకు పుట్టేది. అత్యంత అరుదైన ఈ వ్యాధి ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో బయట పడింది. అంతే కాదు గత ఏడాది మూడు కేసులు గుంటూరు జీజీహెచ్ లో వెలుగు చూశాయి. ఇంత తక్కువ కాలంలో ఇన్ని కేసులు నమోదవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని డాక్టర్లు అంటున్నారు.
చాలా అరుదైన మ్యాడ్ కౌ డిసీజ్ తో ఓ మహిళ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ప్రకాశం జిల్లా తోటవరపాలెం రంగారావుపేటకి చెందిన రత్నకుమారి రెండు వారాల క్రితం జీజీహెచ్ కి వచ్చింది. రత్న కుమారిని పరీక్షించిన న్యూరాలజీ విభాగం డాక్టర్లు దాదాపు మ్యాడ్ కౌ డిసీజ్ అన్న నిర్ణయానికి వచ్చారు. జీజీహెచ్ కి వచ్చే సమయానికే రత్న కుమారి జ్ఞాపక శక్తి మందగించింది. వ్యక్తులని గుర్తించడానికి కూడా ఇబ్బంది పడుతోంది. దాంతో డాక్టర్లు అన్ని పరీక్షలు చేసారు. దాదాపు ఇది మ్యాడ్ కౌ అన్న నిర్దారణకి వచ్చారు.
అసలు ఏంటీ మ్యాడ్ కౌ? అది వస్తే ఏం అవుతుంది?. దానికి చికిత్స ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...మ్యాడ్ కౌ డిసీజ్ మొదట యూరప్ లోని ఆవుల్లో బయట పడింది. అక్కడి ఆవులకి ఈ వ్యాది సోకింది. ఉన్నట్టుండి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, రోజుల వ్యవదిలోనే ఆవులు మృత్యువాత పడ్డాయి. ఆ తరువాత మనుషుల్లో కూడా అవే వ్యాది లక్షణాలతో అక్కడక్కడా కేసులు నమోదయ్యాయి. వ్యాది లక్షణాలని బట్టి మ్యాడ్ కౌ అని పేరొచ్చింది. ఈ వ్యాధి ప్రయాన్స్ అనే సూక్ష్మ క్రిముల ద్వారా సోకుతుంది. ఈ సూక్ష్మ క్రిములు నేరుగా మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. మెదడులో ఒక్కో వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ పోతాయి. దాంతో వ్యాధి సోకిన కొద్ది నెలల్లోనే రోగి చనిపోతాడు.
మ్యాడ్ కౌ వ్యాధికి మందులు కాదు కదా కనీసం నిర్దారించడానికి కూడా ఎటువంటి పరీక్షలు లేవు. మనిషి చనిపోయిన తరువాత మెదడు బయాప్సీ ద్వారా మాత్రమే అది సీజేడీనా కాదా అన్న నిర్దారణకి వస్తారు. ఇంతటి ప్రమాదకరమైన వ్యాదికి గురైన ముగ్గురు వ్యక్తులు గత ఎనిమిది నెలల కాలంలో గుంటూరు జీజీహెచ్‌కి వచ్చారు. ఇందులో ఒకరు ఇప్పటికే చనిపోగా మరో ఇద్దరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇంకా నిర్దారణ కాకున్నా సంవత్సరం లోపుగా సీజేడీ లక్షణాలతో మూడు కేసులు రావడం గతంలో ఎప్పుడూ జరగలేదని.., దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు అంటున్నారు.