తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరు రెండో వారంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ భావిస్తున్నారని - అందుకే ముమ్మరంగా ప్రచారం చేపట్టారని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఈసీ ప్రకటన వెలువడడంపై తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎన్నికల షెడ్యూల్ పై ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ తో కేసీఆర్ కు దిమ్మతిరిగిందని, ఈ రోజు రెండు పెగ్గులు ఎక్కువేసుకుని నిద్రపోక తప్పదని మధుయాష్కీ ఎద్దేవా చేశారు. ఈసీని ప్రలోభ పెట్టి నవంబర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు కేసీఆర్ విశ్వప్రయత్నం చేశారని, అయితే కేసీఆర్ కు ఈసీ షాకిచ్చిందని అన్నారు. నవంబర్ లో ఎన్నికలు జరిగితే టీఆర్ ఎస్ గెలుస్తుందని కేసీఆర్ జ్యోతిషుడు ఆయనకు చెప్పారని, కానీ, డిసెంబర్ లో ఎన్నికలు జరగబోతుండడంతో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు.
అసలు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమే లేదని, ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారని అన్నారు. కానీ, కేసీఆర్ ఎత్తుకు ఈసీ పైఎత్తు వేసిందని, దీంతో, కేసీఆర్ వ్యూహం ఫలించలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముందస్తు నిర్ణయంతో కాంగ్రెస్ - రాష్ట్ర ప్రజలు కొంత ఆందోళన చెందారని అన్నారు. మరోవైపు, అసెంబ్లీ రద్దు వల్ల కేసీఆర్ పాలన నుంచి ముందుగానే విముక్తి లభించినందుకు సంతోషించారని అన్నారు. టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని, అది కేసీఆర్ కు కూడా తెలుసని, ఆ ఫ్రస్ట్రేషన్ లోనే కేసీఆర్ కు మతిభ్రమించిందని అన్నారు. అందుకే, నోటికి వచ్చినట్లు పచ్చి బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అక్టోబరు చివరి వారంలో రాహుల్ గాంధీతో బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని మధుయాష్కీ వెల్లడించారు. నవంబర్‌లో సోనియా గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు.