గత మే నెలలో వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అత్యధిక స్థానాలని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే డీఎంకే తరపున గెలిచిన నలుగురు ఎంపీలకు వేరే పార్టీలో సభ్యత్వం ఉండటంతో... తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డీఎంకే పార్టీకి చెందిన ఉదయించే సూర్యుడు సింబల్ నుంచి నలుగురు మిత్రపక్ష పార్టీల సభ్యులు పోటీ చేసి విజయం సాధించారు.
డీఎంకే పార్టీ సింబల్ పై వీసీకేకి చెందిన రవికుమార్ - కొంగు మక్కల్ దేశీయ కట్చికి చెందిన చిన్నరాజ్ - ఎండీఎంకేకు చెందిన గణేశమూర్తి - ఐజేకేకు చెందిన పారివేందర్ గెలుపొందారు. అయితే ఇలా ఒక పార్టీలో ఉంటూ...మరో పార్టీ సింబల్ పై పోటీ చేసి గెలవడంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక పార్టీకి చెందిన సభ్యుడు ఆ పార్టీ నుంచి వైదొలగకుండా మరో పార్టీ గుర్తుపై పోటీచేయచడం చట్టవిరుద్ధమని మక్కల్ శక్తి కట్చి అధ్యక్షులు ఎంఎల్ రవి పిటిషన్ వేశారు. దీంతో ఇప్పుడు ఆ నలుగురు ఎంపీలకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
ఇక ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తులు సత్యనారాయణన్ - ఎన్.శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి ఆ పార్టీ చిహ్నం పై పోటీచేయడాన్ని అనుమతించడం ఎన్నికల నిబంధనలను మోసగించడం కిందకు రాదా ? అని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తరుపు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ… ఒక పార్టీకి చెందిన వ్యక్తి మరోపార్టీ తరఫున పోటీచేయరాదనే నింబధన ఉందని చెప్పారు.
అయితే ఎన్నికల అధికారి ఆ నామినేషన్ ను ఆమోదించిన పక్షంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల కేసును మాత్రమే వేయాలని - కాబట్టి ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని చెప్పారు. ఇక ఈ కేసు విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్.... ఎన్నికల సంఘం - డీఎంకే - అన్నాడీఎంకే - ఆయా పార్టీల చిహ్నాలపై పోటీచేసి గెలుపొందిన కూటమి పార్టీల ఎంపీలు నవంబరు 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరి ఆ నలుగురు ఎంపీలపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ? చూడాలి.