అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విపరీతమైన ప్రేమాభిమానాలు ప్రదర్శించటంతో పాటు.. ఆయన్ను అత్యంత జాగ్రత్తగా చూసుకొని.. సగౌరవంగా తిరిగి పంపిన సంగతి తెలిసిందే. అమరావతికి వచ్చిన కేసీఆర్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకునేందుకు వీలుగా మంత్రి మాగంటి బాబుకు ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు.
ఏపీలో అడుగు పెట్టిన క్షణం నుంచి.. తిరిగి వెళ్లే వరకూ కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకోవాలని మాగంటి బాబుకు బాధ్యతలు అప్పగించారు. దీనికి తగ్గట్లే కేసీఆర్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన మాగంటి బాబు.. కేసీఆర్ కు తిరిగి వెళ్లే సమయంలో ఒక తీపి కానుకను ఇచ్చి పంపారు. మాగంటి బాబు పాలకొల్లు నుంచి ప్రత్యేక మిఠాయిలు తెప్పించారు. కేసీఆర్ కు బహుమతిగా ఇచ్చేందుకు అత్రేయపురం నుంచి కాజాలు - పూతరేకులు ప్రత్యేకంగా తయారు చేయించారు. వాటిని కేసీఆర్ ఫోటోతో తయారు చేసిన ప్రత్యేక బాక్సుల్లో పెట్టి మిఠాయిల్ని ఆయనకు అందజేశారు. పూతరేకులు.. మడతకాజాలకు పాలకొల్లు - అత్రేయపురం - రాజోలు ప్రాంతం ఫేమస్ అన్న విషయం తెలిసిందే. మొత్తానికి తన ప్రాంతానికి చెందిన మిఠాయిలతో కేసీఆర్ మనసును మాగంటి బాబు దోచుకున్నారంటున్నారు.