దేశంలో తొలిసారి..మ‌హాభార‌తం నాటి వ‌స్తువులు!

Update: 2018-07-31 04:09 GMT
పురాణాలు నిజాలు కావ‌ని కొంద‌రు వాదిస్తుంటారు. మ‌రికొంద‌రు అదంతా అప్ప‌ట్లోజ‌రిగిందేన‌ని బ‌లంగా న‌మ్ముతారు. శాస్త్ర‌సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ పురాణాల్ని న‌మ్మ‌టం ఏమిటి? అంటూ ఏవ‌గింపుగా వ్యాఖ్య‌లు చేసే వారు లేక‌పోలేదు. అలాంటి వారంతా త‌మ మాట‌ల్ని ఆచితూచి మాట్లాడాల్సిన రోజులు వ‌చ్చేసిన‌ట్లే.

దేశంలోనే మొద‌టిసారి.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని రీతిలో తాజాగా పురావ‌స్తు శాఖ జ‌రిపిన త‌వ్వ‌కాల్లో  మ‌హాభార‌తం కాలం నాటి క‌త్తులు.. స‌మాధులు.. శ‌వ‌పేటిక‌లు.. ఆస్థిక‌లు పెద్ద ఎత్తున ల‌భించాయి. క్రీస్తు పూర్వం 2000-1800 నాటి ఈ ప‌రిక‌రాలు.. అవేశాల‌న్నీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని స‌నౌలీలో ల‌భించాయి.

ఆర్కియాల‌జిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా జూన్ లో పెద్ద ఎత్తున త‌వ్వ‌కాల్ని నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ల‌భించిన వ‌స్తువుల్ని ఎర్ర‌కోట‌కు త‌ర‌లించారు. తాజాగా ల‌భించిన వ‌స్తువులు అల‌నాటి రాజ‌కుటుంబానికి చెందిన‌విగా భావిస్తున్నారు. పురావ‌స్తు శాఖ త‌వ్వ‌కాల్లో ఒక ర‌థం దొర‌క‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గ‌తంలో గ్రీసు.. మెసొపొటేమియాల్లో మాత్ర‌మే ఇలా ర‌థాలు ల‌భించ‌గా.. తాజాగా మ‌న దేశంలోనూ ఇదే రీతిలో వ‌స్తువులు ల‌భించ‌టంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా ల‌భించిన స‌మాధుల్లో మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా తినేందుకు వీలుగా కొన్ని ఆహార‌ప‌దార్థాలు.. దువ్వెన‌లు.. అద్దాలు.. బంగారు పూస‌లు స‌మాధుల్లో ల‌భించాయి. స‌మాధుల్లో దొరికిన ఎముక‌లు.. దంతాల్ని డీఎన్ ఏ ప‌రీక్ష‌ల‌కు పంపుతున్నారు. ఈ అధ్య‌య‌నం పూర్తి అయితే.. మ‌రెన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.              
Tags:    

Similar News