తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనాకు తోడు వర్షాలు కూడా పెరగడంతో తేమ వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువైంది.
కరోనాపై ఫైట్ చేస్తున్న పోలీస్ విభాగాన్ని కరోనా కబళిస్తోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శశిధర్ కరోనాతో ప్రాణాలు కోల్పోవడం పోలీస్ శాఖలో విషాదం నింపింది.
గతంలో డీఎస్పీ శశిధర్ పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. ఆ కారణంగా కరోనా సోకడంతో మృతి చెందినట్లు వివరించారు. శశిధర్ మృతి పోలీస్ శాఖలో విషాదం నింపింది. పోలీస్ అధికారులంతా ఆయన మృతికి సంతాపం తెలిపారు.
తెలంగాణలో కొత్తగా 1256 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 80751కి చేరింది. ఇప్పటిదాకా 637మంది చనిపోయారు.