రాజభోగం అంటే మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలదే కదా ...ఎందుకంటే !

Update: 2019-11-11 12:17 GMT
కొన్ని కొన్ని సార్లు ఎన్నికలలో తమ పార్టీ తక్కువ సీట్లు గెలుచుకున్నా కూడా ప్రభుత్వ ఏర్పాటు లో కీలకంగా మారితే ..ఆ పార్టీకి ఎవరైనా కూడా జై కొట్టాల్సిందే. ఎటువంటి ఎన్నో ఘటనలు ఇప్పటికే మనం చూసి ఉంటాం. అది ఈ ప్రజాస్వామ్యం లో సర్వసాధారణం. కానీ , అలాంటప్పుడే ఆ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలకి ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది. అప్పటివరకు ఈగలు తోలుకుంటూ ఉన్న నేతలపై ..ఈగ అన్నదే వాలకుండా చూసుకుంటారు. కాలం కలిసి రావాలని కానీ , ఏదైనా సాధ్యమే అని ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లని చూస్తే ఇట్టే అర్థమౌతుంది.

తాజాగా మహారాష్ట్రలో అసెంబ్లీ కి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ లేదు. 288 స్తనాలకి గాను..ఎన్నికల్లో బీజేపీ తరపున 105మంది విజయం సాధించగా, శివసేనకు 56మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 44మంది,ఎన్సీపీ 54మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే 145మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీనితో బీజేపీ - శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అనుకుంటే .. 50 -50 ఫార్ములా అంటూ శివసేన ముందుకి రావడంతో  ఇద్దరికి చెడి ..ఇప్పుడు బీజేపీ నుండి శివసేన బయటకి వచ్చి ఎన్సీపీ , కాంగ్రెస్ తో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమౌతోంది.

దీనితో కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలని బీజేపీ లాంటి పార్టీలు ఎగురేసుకుపోకుండా జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ రిసార్టుకు తరలించింది. జైపూర్ లోని లగ్జరియస్ రిసార్ట్ లో ఈ శాసన సభ్యులు సుమారు మూడు రోజులుగా కనీవినీ అతిథి మర్యాదలు పొందుతున్నారు. జైపూర్-ఢిల్లీ హైవేకి 1.5 కి. మీ, దూరంలో ఉన్న ఈ బ్రహ్మాండమైన అతిథి గృహంలో గది అద్దె రోజుకు రూ. 1.2 లక్షలట. ప్రతి విల్లాకు ప్రత్యేక స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. బార్లు, స్పా.. ఒకటేమిటి ?ఉండాల్సిన హంగులన్నీ ఇందులో ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో ఈ ఎమ్మెల్యేలతో పృథ్వీ రాజ్ చవాన్, అశోక్ చవాన్, మల్లిఖార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ వంటి పార్టీ సీనియర్ నేతలు సమావేశాలు జరుపుతున్నారు.  .
Tags:    

Similar News