బ్రిటిష్ బంకర్ ను స్వయంగా కనుగొన్న గవర్నర్

Update: 2016-08-17 06:45 GMT
తెలుగువాడైన సీనియర్ రాజకీయ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు ఒక ఘనత సాధించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన.. రాజ్ భవన్ లో ఉన్న ఒక రహస్య బంకర్ ను ఆయనే స్వయంగా కనుగొనటం విశేషం. రాజ్ భవన్ లో ఒక రహస్య బంకర్ ఉందన్న విషయం గవర్నర్ విద్యాసాగర్ దృష్టికి రావటంతో ఆయన దాన్ని కనుగునే ప్రయత్నం చేశారు.

మూడునెలల క్రితం కొందరు వృద్ధ నేతలు విద్యాసాగర్ రావును కలిసి ఈ రహస్య సొరంగం గురించి వెల్లడించారు. దీంతో.. దాని సంగతి చూసేందుకు ప్రయత్నించిన విద్యాసాగర్ రావు తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. బ్రిటిష్ హయాంలో నిర్మించినఈ బంకర్ ను  ఒక గోడతో మూసేసిన విషయాన్ని గుర్తించిన విద్యాసాగర్ రావు.. దాన్ని ప్రజాపనుల శాఖ సిబ్బంది పగలగొట్టారు.

అయితే..ఇందులోసొరంగం బదులు.. 13 రూముల బ్యారక్ బయటపడింది. 5 వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించినఈ బ్యారక్ లో షెల్ స్టోర్.. గన్ షెల్.. క్యాట్రిడ్జ్ షోర్.. షెల్ లిఫ్ట్.. పంప్.. వర్క్ షాప్ ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దీన్ని మూసేసి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికి స్వచ్ఛమైన గాలి.. వెలుతురు వచ్చే సౌకర్యం ఉండేలా దీన్ని తీర్చిదిద్దటం గమనార్హం. కొంతమంది ఇచ్చిన సమాచారంతో రహస్య స్థావరాన్ని గవర్నరేస్వయంగా కనుగొనటం ఆసక్తికరమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News