మోర్బీ ఘటన మరువక ముందే తీగల వంతెనపై కారు.. దుమారం

Update: 2022-11-01 23:30 GMT
గుజరాత్ లోని మోర్బీ నగరంలో తీగల వంతెన దుర్ఘటనలో మానవ తప్పిదాలే 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. కొందరు ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని ప్రమాదకరంగా ఊపడంతో అవి ఊడిపోయి ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి కర్ణాటకలో కొందరు టూరిస్టులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తీగల వంతెనపైకి ఏకంగా కారును ఎక్కించి నడిపేందుకు ప్రయత్నించారు.

ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని పర్యాటకప్రాంతం శివపుర తీగల వంతెనపై తాజాగా ఈ ఘటన  చోటుచేసుకుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు సస్పెన్షన్ బ్రిడ్జిపైకి కారుతో వెళ్లడం దుమారం రేపింది. ఇది గమనించిన స్తానికులు వారిని అడ్డుకున్నారు.

అయినా వారు వినకుండా తీగల వంతెనపైకి కారుతో వెళ్లారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా కారుతో వంతెనపైకి వచ్చారు. స్థానికులు గొడవకు దిగడంతో కారును టూరిసట్టులు వెనక్కి మళ్లించారు. కారును తోసుకుంటూ వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కారు వెనుక చాలా మంది ఉన్నారు. వాహనాన్ని తోసేటప్పుడు వంతెన ఉగుతూ ప్రమాదకరంగా కనిపించింది. గుజరాత్ ఘటనలోనూ ఇలాగే నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుజరాత్ లోని మోర్బీ నగరంలోనూ ఇలాగే తీగల వంతెనపై 500 మంది పరిమితికి మించి చేరడంతో అది కూలిపోయి 135 మంది మరణించారు. కర్ణాటకలోనూ అదే నిర్లక్ష్యం జనాల్లో కనిపించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News