దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దేశం మొత్తంలోనే ఎక్కువ కేసులు నమోదైంది ఈ రాష్ట్రంలోనే. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 2 లక్షలకు పైగా నమోదయ్యాయి. లక్ష మందికి పైగా కోలుకోగా 9,448 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో వైరస్ బారిన పడుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్న కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న పూణే, పింప్రి చిన్చ్వాడ్ ప్రాంతాల్లో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జూలై 13 నుంచి 23వ తేదీ వరకు పది రోజుల పాటు కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తునట్టు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలన్నింటినీ ఆ ప్రాంతాల్లో నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. వైరస్ కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.