మహాత్మా గాంధీ ముని మనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష !

Update: 2021-06-08 07:30 GMT
స్వాత్రంత్య సమరయోధుడు , జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమరాలు 56ఏళ్ల వయస్సులో 6మిలియన్ ఫ్రాడ్, ఫోర్జరీ కేసులో అరెస్టు అయ్యారు. విచారణ జరిపిన దర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా రాంగోబిన్ ను నేరస్థురాలిగా పేర్కొంటూ కోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఎస్ ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి R6.2లు అడ్వాన్స్ గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చింది.

దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని చెప్పింది. లేట్ మేవా రామ్ గోబిన్, ఎలా గాంధీల కూతురైన లతా రాంగోబిన్ దోషిగా తేలడంతో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. లతా రాంగోబిన్ కు వ్యతిరేకంగా 2015లోనే ట్రయల్ ప్రారంభం అయింది. నేషనల్ ప్రోసిక్యూటింగ్ అథారిటీ మాట్లాడుతూ.. ఆమె సబ్ మిట్ చేసిన డాక్యుమెంట్లు, ఇన్వాయీస్ లు అన్నీ ఫోర్జరీ అని తేలాయి. వాటన్నింటిలో ఇండియా నుంచి మూడు కంటైనర్ల లినెన్ ఇండియా నుంచి వస్తుందని చెప్పి మోసగించింది. కంపెనీని మోసం చేశారన్న అభియోగాలతో నేషనల్‌ ప్రోసిక్యూటింగ్‌ అథారిటీ అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తుంది. తాజాగా మరోసారి కోర్టులో విచారణకు రాగా.. ఈ కేసులో లతా రాంగోబిన్‌ దోషిగా తేలడంతో సోమవారం డర్బన్‌ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. లతా రాంగోబిన్ 50వేల ర్యాండ్ తో బెయిల్ పై విడుదల చేశారు. 2015 ఆగస్టులో న్యూ ఆఫ్రికా ఎలియాన్స్ ఫుట్‌ వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ ఎస్ఆర్ మహరాజ్‌ను లతా కలిశారు. వస్త్రాలు, లైనెన్, ఫుట్‌ వేర్ తయారీ, దిగుమతులు సహా ఇతర వ్యాపారులకు ఈ సంస్థ ఆర్థిక సాయం అందజేస్తుంది. వీటి ద్వారా లాభాల్లో కొంత వాటా తీసుకుంటుంది. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం 3 కంటైనర్లలో లైనెన్  ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు లతా నమ్మబలికారు. దిగుమతి చేసుకునేటప్పుడు కస్టమ్స్ సుంకం చెల్లించాలని, అందుకు అవసరమైన నగదు తన దగ్గర లేదని మహరాజ్‌కు చెప్పి సాయం కోరారు.

ఇదే దక్షిణాఫ్రికాలో న్యాయవాది వృత్తిని కొనసాగించిన మహాత్మా గాంధీ. వర్ణవివక్షతపై పోరాటం చేశారు. అక్కడ నెల్సన్ మండేలా వంటి నేతలకు ఆదర్శంగా నిలిచారు. గాంధీజీ మనవరాలు, లతా తల్లి ఎలా గాంధీ, తండ్రి మెవా రాంగోబిన్‌ లు సైతం తమ సామాజిక సేవలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. భారత్, దక్షిణాఫ్రికాల నుంచి పలు గౌరవ సత్కారాలను అందుకున్నారు. వారి కుమార్తె ఆశిష్ లతా మాత్రం మోసపూరిత కేసులో దోషిగా తేలి జైలుపాలయ్యారు.
Tags:    

Similar News