2018లో ఒకసారి వెనక్కి వెళితే..

Update: 2018-12-27 06:50 GMT
2018 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కీలక సంఘటనలు చేసుకున్నాయి. ఈ ఏడాది జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటన గుర్తు చేసుకుందామా మరీ..

* థాయ్ లాండ్ గుహలో 12మంది ఫుట్ బాల్ యువ క్రీడాకారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచనలం రేపింది. ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి - వరద నీరు గుహ ద్వారాన్ని ముంచేసింది. దీంతో చిన్నారుల గుహలోపల నిద్రాహారాలు మాని బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరరకు థాయ్ నేవీ సీల్స్ అసాధారణ రెస్క్యూ చేసి చిన్నారుల కాపాడింది.

* సౌదీ అరేబియాలో మహిళలు స్టీరింగ్ చేతపట్టి రయ్ రయ్ మంటూ కార్లు నడిపే అవకాశాన్ని 2018 ఏడాదిలో దక్కింది. మహిళల డ్రైవింగ్ పై ప్రభుత్వం జూన్ 24న ఎత్తివేసింది. దీంతో సౌదీ అరేబియాలో మహిళలు స్వేచ్ఛవాయులు పీల్చుకున్నారు.

* అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ - ఉత్తర కొరియా నేత జిమ్ జాంగ్ ఉన్ ల మధ్య జూన్ లో నాటకీయ పరిణమాల మధ్య సింగపూర్ లో బేటి జరిగింది. ఇద్దరి మధ్య చర్చలు సఫలమయ్యాయని చెప్పడంతో కొరియాలో శాంతి స్థాపన దిశగా అడుగులు పడ్డాయి.

* ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ మార్చి 14న కన్నుమూశారు. ఆయన అరుదైన వ్యాధితో బాధపడుతూ వీల్ చైర్ కు పరిమితమైనా ఆత్మవిశ్వాసంతో విశ్వరహస్యాన్ని నిరంతరం శోధించేవారు. కృష్ణబిలాలకు సంబంధించి - ఎలియన్స్ గురించి ఆస్తక్తికర విషయాలను ప్రపంచానికి తెలియజేశారు.

* పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా కొత్త ఇన్నింగ్స్ మెుదలుపెట్టారు. ఆగస్టు 18న పాక్ ప్రధాని ప్రమాణ స్వీకారం చేశారు. 22ఏళ్ల కృషితో తన కలను సాకారం చేసుకున్నారు. ప్రధానిగా శాంతిపీఠంపై కూర్చోగానే భారత్ శాంతి విషయంలో ఒక అడుగు ముందుకు వెళ్తే తాము రెండడుగులు వేస్తామని శాంతి మంత్రం ఆలాపించారు.

* రష్యా అధ్యక్షుడిగా పుతిన్ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 18ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆయన మరో ఆరేళ్లపాటు రష్యా పీఠంపై కొనసాగుతారు.

* చైనా దేశ శాశ్వత అధ్యక్షుడిగా జిన్ పింగ్ ఎన్నికయ్యారు. ఒక వ్యక్తి చైనా దేశ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధన చైనా పార్లమెంట్ తిరగరాసింది.

* ఫేస్ బుక్ డేటా లీకేజీ విషయంలో ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ అమెరికా సేనేటర్లకు క్షమాపణ చెప్పారు. ఇక నుంచి ఫేస్ బుక్ సమాచారం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

* వృద్దాప్యం కారణంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్(94) నవంబర్ 30న కన్నుమూశారు. సోవియట్  యూనియన్ విచ్చిన్నమైన సమయంలో - ప్రచ్ఛన్న యుద్ధం చివరి రోజుల్లో ఆయనే అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు.

* అమెరికాలో ఈ ఏడాది మూడు సార్లు షట్ డౌన్ జరిగింది. ట్రంప్ వలస విధానాలతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. ఒకే ఏడాదిలో మూడు సార్లు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడం గత 40ఏళ్లలో ఇదే తొలిసారి

* 2018 వెళ్లిపోతూ తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. ఇండోనేషియాలో సునామీ మరోసారి విరుచుకపడింది. ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం బద్ధలై సముద్రంలో కుప్పకూలి సునామీగా మారింది. దీంతో 500మంది అమాయకులు ప్రాణాలు కొల్పోయారు.

* యూరోపియన్ యూనినుంచి బ్రిటన్ వైదొలగానికి ఒప్పందం(బ్రెగ్జిట్)పై సంక్షోభం నెలకొంది. బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఒకే చేసిన ముసాయిదాపై సొంత పార్టీలోనే వ్యతిరేక నెలకొంది. దీనిపై కొత్త సంవత్సరంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

* గత ఏడేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతమవుతున్న సిరియా పై అమెరికా నేరుగా యుద్ధాన్ని ప్రకటించింది.

* అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరించిన జీరో టాలరెన్స్ వలస విధానం వివాదాస్పదంగా మారింది. సరిహద్దులో శరణార్థుల పడిగాపులు - తల్లీ బిడ్డల్నీ వేరుచేసిన దృశ్యాలు అందరిని కలిచివేసింది. చివరికి ట్రంప్ సర్కార్ పై ఒత్తిడితో తల్లీ బిడ్డల్నీ వేరు చేయద్దని ఉత్తర్వులిచ్చారు.

* శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాత్రికి రాత్రి ప్రధాని కూర్చి నుంచి విక్రమసింఘేను దింపేసి రాజపక్సను కూర్చోబెట్టారు. ఆ తర్వాత రాజపక్స రాజీనామా చేయడం - తిరిగి విక్రమసింఘే ప్రధాని ప్రమాణం చేయడం వెనువెంటనే జరిగిపోయారు.

* బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనువడు ప్రిన్స్ హ్యరీ - అమెరికా నటి మేఘన్ మార్కల్ ఏడాది ఒక్కటయ్యారు. వేయ్యేళ్ల చరిత్ర కలిగిన రాజవంశానికి హాలీవుడ్ గ్లామర్ జతవడంతో ఈ పెళ్లిపై అందరిలోనూ ఆసక్తి కలిగింది.


Tags:    

Similar News