దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు రాజకీయ పక్షాల మీద ఎంత ఉన్నదో చెప్పటం కానీ.. దేశ ప్రజల మీద అమిత ప్రభావం చూపుతున్నట్లుగా తాజా ఘటన రుజువు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీ మానసపుత్రికల్లో ఒకటైన ‘‘మేకిన్’’ ఇండియా నినాదాన్ని విపరీతంగా అభిమానించే ఐఐటీ విద్యార్థులు కోటి రూపాయిల వార్షిక వేతనాన్ని ఇచ్చే జాబ్ కు సైతం నో చెప్పారన్న భావన వ్యక్తం అవుతోంది.
కళ్లు చెదిరిపోయే జీతం.. విదేశాల్లో ఉద్యోగ అవకాశం అంటే చాలు.. మరో ఆలోచన లేకుండా ఎగిరి గంతేసి.. ఓకే చెప్పటం నిన్నటి మాట అన్న కొత్త విషయం మరోసారి రుజువైంది. తాజాగా ఢిల్లీలోని ఐఐటీలో క్యాంపస్ ప్లేస్ మెంట్ కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో భాగంగా పలు ప్రముఖ కంపెనీలు క్యాంపస్ కు వచ్చాయి. ప్రతిభావంతులైన పది మందిని పలు ప్రముఖ కంపెనీలు వారికి రూ.కోటి వార్షిక వేతనంతో విదేశాల్లో ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చారు.
అయితే.. ఈ పది మందిలో నలుగురు విద్యార్థులు నో చెప్పారు. విదేశాల్లో పని చేసే బదులు.. స్వదేశంలో కాస్త జీతం తక్కువైనా ఫర్లేదు.. భారత్ లోనే పని చేస్తామని స్పష్టం చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ ఇచ్చిన ‘‘మేకిన్ ఇండియా’’లో భాగస్వామ్యం కావటం కోసమే వారిలా రిజెక్ట్ చేశారని చెబుతున్నారు. మోడీ పిలుపు ఇచ్చిన మేకిన్ ఇండియా ప్రభావమో కాదో కానీ.. స్వదేశంలో ఉద్యోగం చేయటం కోసం కోటి రూపాయిల విదేశీ ఉద్యోగాన్ని వదిలేసిన ఆ నలుగురు ఐఐటీ విద్యార్థులు దేశానికి సరికొత్త స్ఫూర్తిదాతలు కావాలని ఆశిద్దాం.