తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది తీన్మార్ మల్లన్న. పొద్దుపొద్దున్నే ఆ రోజు న్యూస్ పేపర్లను తనదైన శైలిలో విశ్లేషించే అతగాడి యూ ట్యూబ్ చానల్ కు భారీగానే క్రేజ్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఘాటైన పదజాలంతో విమర్శల్ని సంధించటం.. ఆయన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టటంలో మల్లన్న నేర్పరితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తమకు తిరుగే లేదన్నట్లుగా ఉండే కేసీఆర్ టీంకు.. మల్లన్న మాటలు.. ఆయన చేసే వ్యాఖ్యలు చిరాకు తెప్పించటంలో తప్పేం లేదు.
సరైన సమయం కూడా వెయిట్ చేస్తున్న వారికి.. గతంలో తీన్మార్ మల్లన్న టీంలోపని చేసిన ఒక వ్యక్తి.. ఆయనపై తీవ్రమైన విమర్శలతో పాటు ఆరోపణలు చేయటం తెలిసిందే. అదే సమయంలో తీన్మార్ మల్లన్నపై ఒక యువతి చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వటం.. తన ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరించారంటూ మండిపడుతోంది. అంతేకాదు.. ఒక వీడియోను విడుదల చేసి.. మల్లన్నకు మంట పుట్టేలా విమర్శలు చేశారు.
తమకు వచ్చిన అవకాశాన్ని వదలని పోలీసులు వెంటనే అతడి ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. పలు హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మల్లన్న తీవ్రంగా మండిపడటం తెలిసిందే. ఇదిలా ఉంటే అతడి మీద వచ్చిన కంప్లైంట్ కు సమాధానం చెప్పేందుకు పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. దీంతో.. శుక్రవారం మల్లన్న పోలీసుల ముందుకు వెళతారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. అతడ్ని విచారించేందుకు పోలీసుల టీం ఒకటి రోజంతా వెయిట్ చేసినట్లు చెబుతున్నారు.
వస్తున్నానంటూనే విచారణకు వెళ్లని మల్లన్న ఊహించని ట్విస్టు ఇచ్చారు. తనను పోలీసు విచారణ నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో స్టేషన్ కు పిలిపించి వేధిస్తున్నారని.. అందుకే విచారణకు పిలవకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ కోసం స్టేషన్ కు పిలిచి వేధించటం రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన.. అవసరమైతే ఆన్ లైన్ లో విచారణ జరిగేలా ఆదేశించాలని కోరారు. ఈ ట్విస్టును ఊహించని పోలీసులకు షాకింగ్ గా మారిందంటున్నారు. హైకోర్టులో మల్లన్న దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణ జరుగుతుందని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ కు వస్తానంటూనే చివరకు కోర్టును ఆశ్రయించిన అతడి వ్యవహారం పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై కోర్టు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.