మోడీ విష స‌ర్పం.. కాంగ్రెస్ అగ్ర‌నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..

Update: 2023-04-27 23:28 GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా జోరుగా సాగుతున్నాయి. మీరు అవినీతి ప‌రులంటే.. మీరే దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా దోచేస్తున్నార‌ని మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ఆయ‌న విష స‌ర్పంతో పోల్చారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఖ‌ర్గే.. త‌న మాట‌ల ధాటికి ప‌దును పెడుతూ.. మోడీ ఒక విష స‌ర్పం..ఆ విష సర్పాన్ని ముట్టుకుంటే చనిపోతారన్నారు. దీంతో రాజ‌కీయ దుమారం రేగింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్గేతోపాటు కాంగ్రెస్ పార్టీ.. దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాసేపటికే ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.

వాస్త‌వానికి ఎన్నిక‌ల నేప‌థ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, బీజేపీ శ్రేణులపై కాంగ్రెస్ నేత‌లు విరుచుకుప‌డుతు న్నారు. అలాగే వారు కూడా కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే.. ఖర్గే నోరు జారేశారు. దీంతో బీజేపీ నేత‌లు దీనిని సింప‌తీ కోసం వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ  వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఖర్గే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  
 
అస‌లు ఖ‌ర్గే ఏమ‌న్నారంటే..

``మోడీ అనేవాడు విష స‌ర్పం. ఆ పాముకు విషం ఉందో లేదోనని మీరు అనుకోవచ్చు. ఒకవేళ దానిని టచ్ చేస్తే.. మీరు చనిపో తారు" అని ఖర్గే అన్నారు. ``ఆయ‌న‌ను న‌మ్మ‌కండి.. ఆయ‌న చెప్పిన వారిని అస‌లే న‌మ్మ‌కండి. పాముల చుట్టూ పాములే చేర‌తాయి`` అని ఖ‌ర్గే వ్యాఖ్యానించారు. ఈ   వ్యాఖ్యలపై.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీవ్రంగా మండిపడ్డారు. ఖర్గే మెదడులోనే విషం ఉందని ఆరోపించారు. బీజేపీ, మోడీపై కాంగ్రెస్కు ఉన్న పక్షపాత ధోరణికి ఇది నిదర్శనమన్నారు.  మొత్తాని కి  ఇంకో ప‌ది రోజులకు పైగానే ఉన్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఇలాంటివి ఇంకెన్ని వ‌స్తాయోన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Similar News