తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆరెస్ విలీనం చేసుకోవడంతో షాకయిన కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతోంది. ఆ పార్టీ తెలంగాణ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరిట హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద నాయకులు దీక్ష చేపట్టారు. సీఎల్పీ విలీనానికి నిరసనగా నిర్వహిస్తున్న ఈ 36 గంటల దీక్షలో కుంతియా - ఉత్తమ్ కుమార్ రెడ్డి - జానారెడ్డి - షబ్బీర్ అలీ - వీహెచ్ - శ్రీధర్ బాబు - సీతక్క - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - ఏఐసీసీ ఇన్ ఛార్జి కార్యదర్శి బోస్ రాజులు - పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. దీక్షకు టీజేఎస్ అధినేత కోదండరామ్ - టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిలు సంఘీభావం తెలిపారు.
వీరికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఇందిరాపార్కుకు తరలి వచ్చారు. ఈ క్రమంలో గత కాంగ్రెస్ తో పాటు మహాకూటమిలో భాగమైన పలువురు టీటీడీపీ నేతలు కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు.కాగా అధికార టీఆర్ ఎస్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..‘శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే.. ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరాలని రాజ్యాంగంలో ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని టీఆర్ ఎస్ పార్టీ అనుకూల మీడియాలో అని ప్రచారం జరుగుతోంది. ఇది నిజం కాదు. ప్రజలు ఎవరిని గెలిపించినా మేము డబ్బుతో ఆ నాయకులను కొంటామని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు. ఈ విషయం గురించి ప్రజలే ఆలోచించాలని కోరుతున్నా. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వికృత చర్యలను గమనించాలి’ అని భట్టి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
సీఎల్పీ విలీనం చెల్లదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతులు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు కనువిప్పు కలిగించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. అప్రజాస్వామిక విధానాన్ని చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు అన్నారు.ఇల్లిళ్లు తిరిగి గెలిపించిన కార్యకర్తలను అవమానించారన్నారు.