తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ ఎస్ జతకట్టేందుకు లోపాయికారి ఒప్పందం కుదిరిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కవితకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేశారని అన్నారు. థర్డ్ ఫ్రంట్ పై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని - మోదీ అంటే కేసీఆర్ కు భయమని అన్నారు. కేజ్రీవాల్ కు మద్దతుగా చంద్రబాబుతోపాటు మరికొందరు ముఖ్యమంత్రులు చేపట్టిన నిరసనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. తెలంగాణ కోసం మోదీని 20 వేల కోట్లు అడిగారని - ఒక వేళ కేజ్రీవాల్ కు మద్దతు తెలిపితే ఆ నిధులు రావని కేసీఆర్ భయపడ్డారని ఎద్దేవా చేశారు. సాటి సీఎంకు మద్దతు తెలపని కేసీఆర్ పై మల్లు విరుచుకుపడ్డారు.
గతంలో బీజేపీ - మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ - కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ రావాలని - దానికి తానే నాయకత్వం వహిస్తానని కేసీఆర్ అన్నారు. అయితే, ఆ తర్వాత దాని గురించి పెద్దగా ఎక్కడా మాట్లాడడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ పై మల్లు మండిపడ్డారు. ఆ సమావేశానికి హాజరైన కొందరు సీఎంలు కేజ్రీకి మద్దతు తెలిపారని - నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ పెట్టాలని భావిస్తోన్న కేసీఆర్ .....కేజ్రీకి ఎందుకు మద్దతు తెలపలేదని అన్నారు. బీజేపీతో కేసీఆర్ లాలూచి పడ్డారని - అందుకే మోదీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ ఎస్ మద్దతిస్తుందని జోస్యం చెప్పారు.